Ys jagan : చంద్రబాబు, కేసీఆర్ ఒక గూటి పక్షులే.. జగన్ మాత్రం వేరట..!
ys jagan : రాజకీయాల్లో సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒక గూటి పక్షులేనని, ఇద్దరి ఆలోచన విధానం ఒకే ఉంటుందని అంటున్నా రాజకీయ విశ్లేషకులు. ముందుగా వారి స్వప్రయోజనాలు, తర్వాత పార్టీ ప్రయోజనాల గురించే ఈ ఇద్దరు నేతలు ఆలోచిస్తారని టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు కలిసే పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు లీడర్లు అందరికీ పదవి ఆశ చూపించి లీడర్లను తన వైపుకు తిప్పుకుని సీఎం కుర్చీలో కూర్చున్నారు.
చంద్రబాబుతో కలిసి టీడీపీలో పార్టీలో పనిచేసిన కేసీఆర్ కూడా ఆయన ఆలోచనలను, రాజకీయాలు ఎలా చేయాలో బాగానే వంటబట్టించుకున్నారు కేసీఆర్.. ఇక టీడీపీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ 2001లో టీఆర్ఎస్‌ను స్థాపించి తెలంగాణ కోసం కోట్లాడి చివరకు 2014 ముఖ్యమంత్రి అయ్యారు. అదే టైంలో ఏపీకి చంద్రబాబు కూడా సీఎం అయ్యారు. నాటి నుంచి కేసీఆర్, బాబు ఆలోచన విధానం ఒక్కటే.. సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వలస వచ్చిన నేతలకు మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి గెలిస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది.
ys jagan : కేసీఆర్, బాబు కంటే జగన్ పాలన డిఫరెంట్..
ఏపీ చంద్రబాబును ఢీకొట్టిన జగన్ భారీ విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే, పైన చెప్పిన ఒక గూటి పక్షుల వలే కాకుండా జగన్ కొంచెం డిఫరెంట్.. పాలనలో తండ్రి వైఎస్సార్‌ను ఫాలో అవుతున్నారు. చంద్రబాబు లాగా వలసలను ప్రోత్సహించడం లేదు. బేషరుతుగా వచ్చేవారిని మాత్రమే పార్టీలో చేర్చుకుంటామని ప్రకటించారు. ముందు నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారికే మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ మధ్యకాలంలో ఇతర పార్టీలో చేరి ఉన్నత పదవులు చేపట్టే నాయకులు పెరిగిపోయారు. జగన్ అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. దీంతో వైఎస్సార్ పార్టీలోకి వలసలు తగ్గాయి. అందుకే చంద్రబాబు, కేసీఆర్ కంటే జగన్ కొత్తగా ఆలోచిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.