Chandra Babu | 15 ఏళ్ల సీఎం పదవీకాలం పూర్తి చేసుకున్న చంద్రబాబు .. దక్షిణాదిలో చారిత్రక మైలురాయి
Chandra Babu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో చారిత్రక ఘట్టాన్ని అధిగమించారు. రాజకీయ నేపథ్యం లేకుండా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు, ముఖ్యమంత్రిగా నేటితో (అక్టోబర్ 10) మొత్తం 15 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేశారు. ఇది ఒక రికార్డే కాదు, దక్షిణ భారతదేశ రాజకీయాల్లో అరుదైన ఘనతగా కూడా నిలిచింది.
#image_title
దక్షిణాదిలో మూడో స్థానం
ఇంత కాలం సీఎం పదవిలో కొనసాగిన దక్షిణాది నేతల జాబితాలో చంద్రబాబు మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన కంటే ముందుగా తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరియు పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి మాత్రమే ఈ ఘనతను పొందారు. ఇక ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఈ.కే. నయనార్ లాంటి నేతల కంటే కూడా చంద్రబాబు పదవీకాలంలో ముందున్నారంటే, ఇది ఆయన రాజకీయ స్థైర్యానికి నిదర్శనం.
ఉమ్మడి రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర దాకా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా – 8 సంవత్సరాలు 255 రోజులు
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా – 6 సంవత్సరాలు 110 రోజులు
మొత్తం పదవీకాలం – 15 సంవత్సరాలు
ఈ గణాంకాలు మాత్రమే కాక, ఆయనే ఉమ్మడి రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.