Chandrababu : ప్రధాని మోడీకి బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : ప్రధాని మోడీకి బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు

 Authored By ramu | The Telugu News | Updated on :10 April 2025,5:00 pm

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం అభివృద్ధికి పరంగా కేంద్రంతో కలిసికట్టుగా ముందుకు సాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు, (Chandrababu) వక్ఫ్ చట్ట (Waqf law) సవరణల విషయంలో మాత్రం కేంద్ర నిర్ణయంతో విభేదించారు. కేంద్రం తాజాగా వక్ఫ్ చట్ట సవరణలు చేసి, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల నియామకానికి మార్గం సుగమం చేసింది. పారదర్శకత కోణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్రంలో ముస్లిం సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు (Chandrababu) స్పందించి, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. దీనిని బోర్డు చైర్మన్ అజీజ్ అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్‌లో వక్ఫ్ చట్ట సవరణకు మద్దతుగా నిలిచిన టీడీపీ, జనసేన పార్టీలపై ముస్లింలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu ప్రధాని మోడీకి బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు

Chandrababu : ప్రధాని మోడీకి బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు

ఇక వక్ఫ్ బోర్డు (Waqf Board) ఆస్తులను లీజుకు ఇవ్వాలన్న బోర్డు నిర్ణయంపైనా చంద్రబాబు (Chandrababu) అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై బోర్డు చైర్మన్ క్లారిటీ ఇస్తూ, మసీదుల ముతవల్లీలు, ప్రభుత్వ అనుమతి లభిస్తేనే ఆస్తులను లీజుకు ఇస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో వక్ఫ్ వ్యవహారాల్లో పూర్తి గౌరవం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు, ముస్లింల్లో భరోసా కలిగించేలా ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది