Chandrababu public meeting CM Jr NTR Slogans
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు .. జూనియర్ ఎన్టీయార్ సెగ మామూలుగా లేదు.. మొన్న కుప్పంలో ఏకంగా 40 అడుగుల ఫ్లెక్సీని పెట్టి మరీ, కేడర్ స్లోగన్లతో హోరెత్తిస్తే, ఇప్పుడు బందరులోనూ అదే పరిస్థితి.. టీడీపీ పగ్గాల్ని తన వారసుడైన లోకేష్ కు అప్పగిద్దామనుకుంటుంటే, కేడర్ లో మాత్రం కొందరు జూనియర్ ఎన్టీఆర్ ను పిలవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు మాత్రం సైలెంట్ గానే ఉంటుండడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
Chandrababu public meeting CM Jr NTR Slogans
తాజాగా మచిలీపట్నంలో ఇటీవలే చనిపోయిన టీడీపీ నేత కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెళ్లారు. ఈనేపథ్యంలోనే అధినేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు.. పార్టీ జెండాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న జెండాలను పట్టుకొని నిల్చున్నారు. ఒకవైపు ‘జై బాబు, జైజై బాబు’ అంటూనే మరోవైపు ‘నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ.. స్లోగన్స్‌తో హోరెత్తించారు. ఈ మధ్య చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఇలాంటి సీన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఆమధ్య చంద్రబాబు సొంత ఇలాకా కుప్పంలో కూడా తారక్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తమ్ముళ్లు. అయితే దీనిపై చంద్రబాబు అప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. మరి అవే సీన్స్ పదే, పదే రిపీట్ అవడంపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందోనన్న డిస్కషన్ నేతల్లో సాగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలు కొత్త కాదన్న సంగతి తెలిసిందే. గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేశారు కూడా. ఆ తర్వాత దూరం జరిగారు. అయితే..గతంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు సైతం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ కార్యకర్తల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలా రియాక్టయ్యే అవకాశం ఉంది.. తన తాతగారు పెట్టిన పార్టీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రాజకీయంలోకి వస్తారా.. రారా? అనే సందేహాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
Chandrababu public meeting CM Jr NTR Slogans
అయితే, ఇదే సమయంలో మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే రాజకీయాల్లోకి రావద్దని కోరుతున్నారు. సినిమాల్లోనే కొనసాగాలని జూనియర్ ఎన్టీఆర్ కు సూచిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను పాలిటిక్స్‌లోకి తీసుకురావాలన్న కొందరి ప్రయత్నాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు తమ అభిమాననటుడుకి తమ వెర్షన్ సోషల్ మీడియా వేదికగానూ వివరిస్తున్నారు. ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ ఎలా ఉంది? అనే అంశాలు ప్రస్తుత చర్చలో భాగం అయ్యాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని ప్రచారం జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అన్ని రూమర్స్ ను జూనియర్ ఎన్టీఆర్ కొట్టిపడేశారు. ఇప్పుడు ఇంతలా వస్తున్న ఒత్తిడికి జూనియర్ ఎన్టీఆర్ ఎలా చెక్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి ==> కత్తి మహేష్ మృతిపై అనుమానాలు .. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఇది కూడా చదవండి ==> వీళ్లు అటా.. ఇటా.. చంద్రబాబుకు దమ్కీ ఇచ్చి.. వైసీపీలో ఈ నలుగురు నేతలు చేరినట్టేనా?
ఇది కూడా చదవండి ==> ఆ సీనియర్ మంత్రికి సీఎం వైఎస్ జగన్ చెక్.. మంత్రివర్గ విస్తరణలో ఆయన ఔట్..?
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.