chandrababu
అనంతపురం : సాధారణంగా అధికార పార్టీకి పదవుల విషయంలో తలనొప్పులు ఎదురవుతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. అనూహ్యంగా ప్రతిపక్షంలో పదవుల కోసం పోటీ నెలకొంది. అసలే ఘోరంగా ఓడిన పార్టీలో పదవుల కోసం కొట్లాటలు తప్పడం లేదు. ఇవి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధిష్టానం నాయకులను ఎంపిక చేసింది. పార్లమెంటరీ కమిటీ నుంచి నియోజకవర్గ స్థాయి కమిటీల వరకు నేతలకు పగ్గాలు అప్పజెప్పారు. అన్ని చోట్లా సజావుగా సాగిన పదవుల పంపకాలు.. అనంతపురం జిల్లాలో మాత్రం చిచ్చుపెడుతున్నాయి.
chandrababu
నేతల మధ్య సరైన సఖ్యత లేకపోవడంతో జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటో కూడా అధిష్టానానికి తెలియని దుస్థితి నెలకొంది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా పార్థసారధి ఉన్నారు. ఇక హిందూపురం పార్లమెంటరీ కార్యదర్శిగా లక్ష్మి నారాయణను నియమించిన అధిష్టానానికి అనంతపురం పార్లమెంటరీలో మాత్రం బ్రేకులు పడింది. పార్లమెంటరీ పరిధిలో ఉన్న రెండు మూడు నియోజకవర్గాల నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తమకంటే తమకే ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.
tdp
ముఖ్యంగా సింగనమల, ఉరవకొండలో మధ్య వర్గ పోరు కొనసాగుతున్నట్లు సమాచారం. శ్రీధర్, రామలింగారెడ్డి ఈ పోటీలో ఉన్నారని తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శి పోస్టులు మాకే ఇవ్వాలని వీరిద్దరూ .. లోకేష్, చంద్రబాబును కలసి కోరినట్లు సమాచారం. తాము పదవి చేపడితే వచ్చే ఎన్నికల్లో విజయం తధ్యం అని అధినేత వద్ద మార్కులు కొట్టే ప్రయత్నం చేశారనే టాక్ నడుస్తోంది. అంతే కాదు తాము వారికే పార్టీ పదవులను ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లను తమ వారికే కట్టబెట్టాలని ఒత్తిడిని తెస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పదవి ఏదైనా తమ వారికే దక్కాలనే ధోరణితో ఏమాత్రం తగ్గేదే లే అంటున్నారు. దీంతో అధిష్టానం పదవులపై ఎటూ తేల్చక నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. తాజాగా ఈ సమస్యను అధిగమించేందుకు టీడీపీ అధిష్టానం ఓ కొత్త పధకాన్ని రచించినట్లు సమాచారం. అనంత పార్లమెంట్ నియోజకవర్గంలో పదవుల పంపకాల కోసం ఓ కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు నేతలతో కమిటీ వేసి అందరి ఏకాభిప్రాయం మేరకు నియామకాలు చేపట్టే అవకాశముంది. మరి .. ఈ కమిటీ ఏమి తేల్చనుందో.. అటు తర్వాత .. పార్టీలో ఎంత రచ్చ జరగనుందో అన్నదే చర్చనీయాంశంగా మారింది.
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
This website uses cookies.