Chicken Chinthamani Fry Recipe Making In Telugu
Chicken Chinthamani : ప్రస్తుతం చికెన్ ప్రియులు ఎక్కువ అయిపోయారు. చికెన్ ను వివిధ రకాల స్టైల్స్ లో చేస్తూ ఆస్వాదిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ తప్పనిసరిగా ఉంటుంది. చికెన్ ఇష్టపడని వారు ఉండరు. అయితే మనం అప్పుడప్పుడు రెస్టారెంట్ కి వెళ్లి చికెన్ తింటుంటాం. అక్కడ చికెన్ చింతామణి ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ధర కూడా ఎక్కువే. అయితే ఈజీగా మన ఇంట్లో కూడా చికెన్ చింతామణి ఫ్రై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు : 1) చికెన్ 2) ఆవాలు 3)నువ్వుల నూనె 4) మెంతులు 5) ఉల్లిపాయలు 6) ఎండుమిర్చి 7) కరివేపాకు 8) అల్లం పేస్ట్ 9) పసుపు 10) కొత్తిమీర 11) ఉప్పు తయారీ విధానం : ముందుగా 75 మి.లీ నువ్వుల నూనెను వేడి చేసుకోని ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో 20 నుంచి 25 దాకా చిన్న ఉల్లిపాయలను వేసుకొని మూడు రెబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. సుమారుగా వేయించుకున్న 10 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు పాయలు పాయలుగా అయిపోతాయి.
Chicken Chinthamani Fry Recipe Making In Telugu
అప్పుడు ఇందులో 25 ఎండుమిర్చిలను వేసి వేపుకోవాలి. తర్వాత ఒకటిన్నర స్పూన్ల అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి వేపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తరువాత ఇందులో అరకిలో చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు కొద్దిగా మగ్గాక కొన్ని వాటర్ పోసుకోని మెత్తగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఆఖరికి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ చింతామణి ఫ్రై రెడీ. దీనిని ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
This website uses cookies.