Chicken Chinthamani : రెస్టారెంట్ స్టైల్ చికెన్ చింతామణి ప్రై ఇలా చేయండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chicken Chinthamani : రెస్టారెంట్ స్టైల్ చికెన్ చింతామణి ప్రై ఇలా చేయండి

Chicken Chinthamani : ప్రస్తుతం చికెన్ ప్రియులు ఎక్కువ అయిపోయారు. చికెన్ ను వివిధ రకాల స్టైల్స్ లో చేస్తూ ఆస్వాదిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ తప్పనిసరిగా ఉంటుంది. చికెన్ ఇష్టపడని వారు ఉండరు. అయితే మనం అప్పుడప్పుడు రెస్టారెంట్ కి వెళ్లి చికెన్ తింటుంటాం. అక్కడ చికెన్ చింతామణి ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ధర కూడా ఎక్కువే. అయితే ఈజీగా మన ఇంట్లో కూడా చికెన్ చింతామణి ఫ్రై […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 August 2022,7:30 am

Chicken Chinthamani : ప్రస్తుతం చికెన్ ప్రియులు ఎక్కువ అయిపోయారు. చికెన్ ను వివిధ రకాల స్టైల్స్ లో చేస్తూ ఆస్వాదిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ తప్పనిసరిగా ఉంటుంది. చికెన్ ఇష్టపడని వారు ఉండరు. అయితే మనం అప్పుడప్పుడు రెస్టారెంట్ కి వెళ్లి చికెన్ తింటుంటాం. అక్కడ చికెన్ చింతామణి ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ధర కూడా ఎక్కువే. అయితే ఈజీగా మన ఇంట్లో కూడా చికెన్ చింతామణి ఫ్రై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు : 1) చికెన్ 2) ఆవాలు 3)నువ్వుల నూనె 4) మెంతులు 5) ఉల్లిపాయలు 6) ఎండుమిర్చి 7) కరివేపాకు 8) అల్లం పేస్ట్ 9) పసుపు 10) కొత్తిమీర 11) ఉప్పు త‌యారీ విధానం : ముందుగా 75 మి.లీ నువ్వుల నూనెను వేడి చేసుకోని ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో 20 నుంచి 25 దాకా చిన్న ఉల్లిపాయలను వేసుకొని మూడు రెబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. సుమారుగా వేయించుకున్న 10 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు పాయలు పాయలుగా అయిపోతాయి.

Chicken Chinthamani Fry Recipe Making In Telugu

Chicken Chinthamani Fry Recipe Making In Telugu

అప్పుడు ఇందులో 25 ఎండుమిర్చిలను వేసి వేపుకోవాలి. తర్వాత ఒకటిన్నర స్పూన్ల అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి వేపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తరువాత ఇందులో అరకిలో చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు కొద్దిగా మగ్గాక కొన్ని వాటర్ పోసుకోని మెత్తగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఆఖరికి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ చింతామణి ఫ్రై రెడీ. దీనిని ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది