YS Jagan : రాష్ట్రంలో మహిళలపై వరుస దారుణాలపై పోలీసులకు సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..!
రాష్ట్రంలో ఇటీవల వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరగడం విచారకరం. మహిళా హోం మంత్రి ఉన్న సమయంలో ఇలా సంఘటనలు జరగడం బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మహిళలపై అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం దిశా చట్టం తీసుకు వచ్చింది. దేశంలో ఎక్కడా లేని సరికొత్త ఈ చట్టంతో అఘాయిత్యంకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా రూల్ పెట్టారు. ఇప్పటికే ఎన్నో కేసుల్లో శిక్షలు పడేలా చేసింది. దిశా మొబైల్ యాప్ ఎంతో ప్రయోజనకారిగా ఉంది. దిశ పోలీస్ స్టేషన్లు ఇంకా ఎన్నో రకాలుగా సేవలందిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఇంకా కూడా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.తాజా పరిణామాలపై సీఎం జగన్ స్పందిస్తూ పోలీస్ వ్యవస్థ తో సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. అఘాయిత్యంకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. బాధితులకు రక్షణ గా ఉంటూ వారికి అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో మళ్లీ ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించాలని ఎక్కడా కూడా మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ లో మరింత చురుకుగా పని చేయాలని జగన్ సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి వెంటనే ముగింపు పలకాలని ఉద్దేశంతో పోలీసులు పని చేయాలన్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేసే ఉద్దేశంతో రోడ్లపైకి రావడంతో పోలీస్ లా అండ్ ఆర్డర్ పరిరక్షించే అవకాశం లేకుండా పోతుంది అంటూ వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కొన్ని విషయాల పట్ల సమయం పాటించాలని, ముఖ్యంగా ఇలాంటి విషయాల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించాలంటూ వైకాపా మంత్రులు తెలుగు దేశం పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.