Home » Andhra Pradesh » Chikoti Praveen Link With Ys Jagan Tdp Flop Show
andhra pradesh

YS Jagan : వైఎస్ జగన్ మీద టీడీపీ ‘క్యాసినో స్కెచ్’ అట్టర్ ఫ్లాప్.!

Authored By
aruna
The Telugu News | Published on: August 4, 2022, 10:00 pm
Advertisement

YS Jagan : ఎద్దు ఈనింది.. అనగానే, దూడను కట్టెయ్యమన్న చందాన, ఎక్కడ ఏం జరిగినా, దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యుడని ఆరోపించడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయింది. తెలంగాణలో ‘క్యాసినో’ లావాదేవీల నేపథ్యంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నాడు చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి. ఆయనకు పలువురు రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నమాట వాస్తవం. అయితే, తాను చస్తున్నది లీగల్ వ్యవహారమేనని చికోటి ప్రవీణ్ అంటున్నాడు. ఆయన్నేమీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈడీ యెదుట విచారణకు హాజరవుతున్నాడు, ఈడీ సంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడాయన. గతంలో గుడివాడలో కాసినో జరిగిందనే ఆరోపణలు రాగా, దానికి చికోటి ప్రవీణ్‌ని లింకు పెట్టి టీడీపీ, నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు మొదలు పెట్టింది.

Advertisement

మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మల్యే వల్లభనేని వంశీ మోహన్ తదితరుల పేర్లను ఈ క్యాసినో వివాదంలోకి లాగి తెలుగుదేశం పార్టీ ఎంత రచ్చ చేయాలో అంతకు మించిన రచ్చ అప్పుడూ చేసింది, ఇప్పుడూ చేస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై చికోటి ప్రవీణ్ స్పందించాడు.తాను ఎదుర్కొంటున్న ఆరోపణలకీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ సంబంధం లేదని చెప్పాడాయన. వైఎస్ జగన్ మీద దుష్ప్రచారం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నది ఆయన వివరణ. ఏ రాజకీయ నాయకుడితోనూ తనకు వ్యాపార సంబంధాలు లేవని వివరించారు.

Chikoti Praveen Link With YS Jagan, TDP Flop Show

Advertisement

ఇంకోపక్క సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చికోటి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. చికోటి ప్రవీణ్ ‘క్యాసినో’ వివాదంలో విచారణ ఎదుర్కొంటున్న దరిమిలా ఆయన గనుక అక్రమాలకు పాల్పడినట్లు తేలితీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన మీద చర్యలు తీసుకుంటుంది. పైగా, అది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం. ఈడీ అనేది జాతీయ దర్యాప్తు సంస్థ. అలాంటప్పుడు, ఈ వివాదంలోకి రాజకీయాన్ని ఏపీలోని ప్రతిపక్షం లాగడం వల్ల ప్రయోజనమేంటి.? ఈ గొడవతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం.?

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి