Chiranjeevi | చిరంజీవి బర్త్‌డే స్పెషల్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైటిల్ గ్లింప్స్ విడుదల | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi | చిరంజీవి బర్త్‌డే స్పెషల్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైటిల్ గ్లింప్స్ విడుదల

 Authored By sandeep | The Telugu News | Updated on :22 August 2025,11:54 am

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు మరో ప్రత్యేక కానుక అందింది. ప్రస్తుతం ఆయన దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి అధికారికంగా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ఎన్నో రోజులుగా ఊహాగానాలు జరుగుతున్నట్లు… ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌తో పాటు గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. చిరంజీవి ఈ గ్లింప్స్‌లో కనిపించిన స్టైల్, ఎనర్జీ, మాస్ అప్పీల్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.

#image_title

లుక్ అదిరింది..

ఈ సినిమాను అనిల్ రావిపూడి తన స్టైల్‌కు అనుగుణంగా ఫ్యామిలీ కామెడీ, మాస్ ఎలిమెంట్స్ మేళవించి రూపొందిస్తున్నాడు. చిరు నయనతార జోడీగా కనిపించనుండగా, ఇతర కీలక పాత్రల్లో కేథరిన్ ట్రెసా, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. సంక్రాంతి రేసులో మిగతా బడా సినిమాలకు పోటిగా ఈ చిత్రం నిలవనుందని భావిస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థతో పాటు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా నిర్మిస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి