Chiranjeevi : పవన్ ను సీఎంగా చూడటం కోసమే చిరంజీవి రంగంలోకి? మరి చిరంజీవి పరిస్థితి ఏంటి?
Megastar Chiranjeevi కి రాజకీయాలంటే ప్రాణం. తను సినిమాను ఎంత ప్రేమిస్తారో? రాజకీయాలను కూడా అంతే ప్రేమిస్తారు. కానీ.. ఆయనకు రాజకీయాలు అస్సలు కలిసి రావడం లేదు. ఏంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పారు కానీ.. దాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజకీయాల నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత రాజకీయాల గురించి పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. మళ్లీ సినిమాల్లో తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించి సినిమాలు చేస్తున్నారు.
కట్ చేస్తే.. ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్.. తర్వాత కొన్ని రోజులు ఒంటరిగా పోరాటం చేశారు. ఏ పార్టీ లేకున్నా.. ఆ పార్టీ.. ఈ పార్టీ మద్దతుతో ఏదో విధంగా ప్రజల్లో మాత్రం నానుతూ వచ్చారు. కానీ.. ఫలితం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పేరుతో పార్టీ నెలకొల్పారు. ప్రస్తుతం పార్టీ ఏపీ మొత్తం విస్తరింపజేశారు.
అయితే… పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఏనాడూ తన మద్దతును పార్టీకి గానీ.. పవన్ కు గానీ తెలపలేదు. సినిమాల పరంగా పవన్ ను మెగాస్టార్ ప్రోత్సహిస్తూ వస్తున్నారు కానీ.. రాజకీయాల్లో ఏనాడూ పవన్ కు మద్దతు ఇవ్వలేదు. దీంతో పవన్ కు మెగాస్టార్ నుంచి మద్దతు రావడం కష్టమే అని జనసైనికులు భావించారు.
కానీ.. సడెన్ గా జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశం అయ్యాయి. పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కూడా మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో పవన్ కు చిరంజీవి రాజకీయంగా ఎటువంటి మద్దతు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారని నాదెండ్ల చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పవన్ ను సీఎంగా చూడటం కోసమేనా?
నిజానికి చిరంజీవి అప్పట్లో ముఖ్యమంత్రి కావాలని ఆశ పడ్డారు. కానీ.. అది కుదరలేదు. దీంతో తాను ముఖ్యమంత్రి పీఠం మీద ఆశ వదిలేసుకున్నారు కానీ.. తన తమ్ముడు పవన్ ను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాలని తెగ ఆశపడుతున్నారట చిరంజీవి. అందుకే ఎలాగైనా తన తమ్ముడికి రాజకీయంగా మద్దతు ఇవ్వడం కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కానీ.. ఇతర కార్యక్రమాల్లో కానీ.. అన్నింట్లో జనసేనకు మద్దతుగా నిలబడితే.. 2024 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ, జనసేన కూటమి గెలిస్తే.. తన తమ్ముడిని సీఎంగా చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. చూద్దాం మరి.. మెగాస్టార్ కోరిక నెరవేరుతుందో? లేదో?