Chiranjeevi : రాజకీయాలపై చిరంజీవి యూటర్న్.. ఆ మాట వెనుక ఇంత అర్థం దాగుందా..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుండి రాజకీయాలపై యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మెంబర్‌గా ఉన్న చిరు.. కేంద్రమంత్రి పదవికాలం పూర్తవగానే యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనలేదు కదా.. కనీసం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరు.. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 18 ఎమ్మెల్యే స్థానాలను ఆయన పార్టీ కైవసం చేసుకుంది.
Chiranjeevi : కేవలం సినిమా ప్రమోషన్ కోసమేనా..
కొంతకాలం తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. వైఎస్సార్ హయాంలో ఏపీ నుంచి కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ, తెలంగాణ విడిపోయాక కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అధికారాన్ని కోల్పోయింది. ఏపీలో దాని పరిస్థితి మరింత దయనీయంగా మారితే.. తెలంగాణలో అధికారంలో రావడం మానుకుని ప్రతిపక్షంతో సరిపెట్టుకుంది. ఇదిలాఉండగా ఏపీ, తెలంగాణలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయించాలని హస్తిన కాంగ్రెస్ భావిస్తోందట. ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా ఉంది. ఇటీవల చిరు జగన్‌ను పలుమార్లు కలిసారు. దీంతో ఆయన వైసీపీలో చేరతారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు ఇస్తారని జనసైనికులు నమ్ముతున్నారు.ఇందులో ఏది నిజం ఇంకా తెలియరాలేదు.
అయితే, చిరంజీవి ఇచ్చిన స్టేట్మెంట్ పై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. ‘నేను రాజకీయాలకు దూరం కావొచ్చు. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు’ ఈ ఒక్క డైలాగ్ చిరు మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని నమ్మకాన్ని కలిగించాయి. కాగా, చిరు నటించిన గాడ్ ఫాదర్ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇందులో పవర్ ఫుల్ రాజకీయ నాయకుడిగా చిరు చేస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేందుకే చిరు ఇాలా కామెంట్ చేసి ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తాజాగా యాంకర్ శ్రీముఖి చిరును ఇంటర్వ్యూ చేసిన వీడియోలో చిరు చెప్పిన డైలాగ్ మూవీ కోసమే అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఎందుకంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరు గతంలోనే చెప్పారు. ఇప్పుడు తను మళ్లీ ఏదైనా పార్టీ తరఫున వస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు.