Chiranjeevi | ఓజీ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ చిరు ప్రశంసల జల్లు.. టీమ్ ఫుల్ ఖుష్
Chiranjeevi | సోమవారం కుటుంబంతో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి కొద్ది సేపటి క్రితం తన సోషల్ మీడియా వేదికగా చిత్రం అద్భుతంగా ఉందని, హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉందని కొనియాడారు. సినిమా చూసిన అనుభూతిని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గత రాత్రి మా కుటుంబంతో కలిసి ‘OG’ సినిమా చూశాను అని పేర్కొన్నారు.
చిరు ప్రశంసలు..
సినిమాలో ప్రతి బిట్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా అద్భుతంగా తీసిన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ఇది. అలాగే ఈ సినిమా దర్శకుడు సుజిత్ పనితీరు అద్భుతం మొదటి నుంచి చివరి వరకు దర్శకుడు సినిమాను అసాధారణ రీతిలో ఊహించి తెరకెక్కించారు.. తెరపై కల్యాణ్ బాబును చూసి చాలా గర్వంగా అనిపించింది.
కళ్యాణ్ తన స్వాగ్‌తో సినిమాను నిలబెట్టి, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పండుగను అందించారు అంటూ చిరు అన్నారు. మరోవైపు సంగీత దర్శకుడు తమన్ ప్రాణం పెట్టి బాణీలు రూపొందించాడు. రవి కె. చంద్రన్ అద్భుతమైన విజువల్స్ అందించారు ఎడిటింగ్ మరియు ఆర్ట్‌వర్క్ సూపర్. ఈ టీమ్ లోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి అత్యుత్తమమైన అవుట్‌పుట్‌ను అందించారు. నిర్మాత దానయ్యకు మరియు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని చిరంజీవి రాసుకోచ్చాడు.