cisf constable recruitment 2022
CISF Jobs : నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగం లేని వారు 12వ తరగతి చదివి ఉన్నట్టైతే భద్రతా దళంలో ఉద్యోగం పొందే అవకాశం పొందొచ్చు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 1149 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉద్యోగం పొందాలంటే CISF అధికారిక వెబ్‌సైట్, cisf.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 29 జనవరి 2021 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ లేదా ఫైర్‌మెన్ (పురుషుడు) రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత గల అభ్యర్థులు 04 మార్చి 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ రిక్రూట్ మెంట్ జరుగుతోంది.
ఇప్పటికే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
cisf constable recruitment 2022
1. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్- cisfrectt.inకి వెళ్లండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన నోటీసు బోర్డు ఎంపికకు వెళ్లండి.
3. ఇందులో మీరు కానిస్టేబుల్-ఫైర్ 2021 కోసం అప్లికేషన్ పోర్టల్ లింక్‌కి వెళ్లండి
4. అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
5. ఆ తర్వాత అడిగిన వివరాలను నింపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
6. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను నింపవచ్చు.
CISF మొత్తం 1149 కానిస్టేబుల్ లేదా ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తుంది. వీటిలో జనరల్ కేటగిరీకి 489 సీట్లు ఖరారు చేశారు. మరోవైపు, ఓబీసీకి 249, ఈడబ్ల్యూఎస్‌కు 113, ఎస్సీకి 161, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 137 సీట్లు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 ఏళ్లు, 23 ఏళ్లు మించకూడదు. అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతీ 80-85 సెంటీమీటర్లు ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికవుతారు. చివరగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా అప్లై చేయండి.
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
This website uses cookies.