CM Jagan : తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీ ఏర్పాటు చేయండి.. అమిత్ షాకు సీఎం జగన్ విజ్ఞప్తి

CM Jagan : తిరుపతిలో ప్రతిష్టాత్మక నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిషాకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్ కేంద్రంగా ప్రపంచ స్ధాయి విద్యను అందించేలా కేంద్ర ప్రభుత్వం గాంధీనగర్‌ కేంద్రంగా నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లు కూడా స్ధాపించింది. ఇదే తరహాలో తిరుపతి వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణ భారత దేశంలో ఫోరెన్సిక్‌ రంగంలో సేవలందించే సంస్ధలు లేవని తిరుపతిలో ఈ నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీకి ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్‌ సైన్స్, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్‌ సైన్స్‌ మరియు క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిచడంతో పాటు ఈ రంగంలో ఫోరెన్సిక్‌ నిపుణులను తయారు చేయడానికి తిరుపతిలో ఏర్పాటు చేసే క్యాంపస్ ఉపయుక్తంగా ఉంటుందని

హోం మంత్రితో గురువారం నాడు ఢిల్లీలో జరిగిన భేటీలో సీఎం జగన్ పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రిమినల్ జస్టిస్ ఇనిస్టిట్యూట్‌లను బలోపేతం చేయడంపై దృష్టి సారించడాన్ని సీఎం జగన్ కొనియాడారు. తిరుపతిలో ఈ మేరకు అవసరమైన భూమిని కేంద్ర సంస్థకు ఉచితంగా ఇవ్వడానికి రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా, విద్యారంగంలోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరాన్ని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటుకు పరిశీలించాలని కోరారు. ఈ భేటీలో రాష్ర్ట విభజనకు సంబంధించి పెండింగ్ ఉన్న అంశాల పరిష్కారంపై సీఎం జగన్ కేంద్ర హోం మంత్రితో చర్చించారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిల చెల్లింపు 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిని సీఎం జగన్ కోరారు.

CM Jagan appeal to Amit Shah

రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింత 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైనవాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు పెండింగ్ లో ఉన్నాయని, రెండు రాష్ట్రాల మధ్య కీలకమైన విభజన అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిలను ఇప్పించాల్సిందిగా హోం మంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం నిబంధనలతో ఏపీపై పెనుభారం జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేకపోవడంతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని,

రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని వివరించారు.ప్రతి నెలా సుమారు 3 లక్షల టన్నులు రేషన్‌ బియ్యం కేంద్రం వద్ద మిగులుగా ఉన్నాయని, ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్లు అవుతుందని ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని హోం మంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజన తర్వాత కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలుసుకుని ఇప్పటికి 14 మెడికల్‌ కాలేజీలతో పాటు

మరో 12 జిల్లాలకు వెంటనే మెడికల్‌ కాలేజీలు మంజూరుచేయాలని కోరారు. కడపలో నిర్మించనన్న సీల్‌ప్లాంటుకు కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు. విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై కేంద్రానికి సమర్పించిన డీపీఆర్, ప్రాజెక్టుకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్‌ఇరిగేషన్‌ స్కీంకు సంబంధించిన పర్యావరణ అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ అంశాలపై చర్చ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌రిజర్వాయర్లకు సంబంధించిన అంశాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ వివరించారు. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులలో

తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా నిర్మిస్తున్న పాలుమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్‌లకు పర్యావరణ అనుమతులు మంజూరుకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. రాష్ర్టంలో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల ప్రమోషన్‌ కోసం పాలసీ ఆధారంగా చేపడుతున్న ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని హో మంత్ర అమిత్ షాకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

Share

Recent Posts

Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు

Pension : తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి…

2 hours ago

Heavy Rains : తెలంగాణ లో స్కూళ్లకు సెలవు ఇవ్వండి మహాప్రభో..!

Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉమ్మడి…

3 hours ago

Vedma Bojju : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ సర్కార్ కు కొత్త తలనొప్పి..!

Vedma Bojju : తెలంగాణ ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఒక కీలక ప్రకటన చేశారు. ఇటీవల…

4 hours ago

SBI శుభ‌వార్త‌.. రూ.10 వేల పెట్టుబడి పెడితే 3 ఏళ్లకే రూ.5.50 లక్షలు..!

SBI  : భారత్‌లో అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ (SBI Mutual Funds), కస్టమర్లకు…

5 hours ago

Actress : ఆ సీన్ వ‌ల‌న నా పేరెంట్స్, కూతురు న‌న్ను వ‌ద్ద‌న్నారు..కాళ్లు ప‌ట్టుకొని ఏడ్చిన హీరోయిన్

Actress  : 2019లో విడుదలైన కన్నడ సినిమా ఐ లవ్ యులో రచితా రామ్ కథానాయికగా నటించగా, ఉపేంద్ర ప్రధాన…

6 hours ago

Coriander Seed Water : రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటితో సూపర్ బెనిఫిట్స్… శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…?

Coriander Seed Water : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులు ఒకటి ధనియాలు. ఈ ధనియాలతో…

7 hours ago

Sweet Corn : ఈ వ్యాధి ఉన్నవారు స్వీట్ కార్న్ తినొచ్చా…?

Sweet Corn : వర్షాకాలం వచ్చిందంటేనే వేడివేడిగా ఏదైనా తినాలని కోరిక ఉంటుంది. సాయంత్రం సమయంలో స్నాక్స్ లాగా స్వీట్…

8 hours ago

Hari Hara Veera Mallu : ప‌వ‌న్ మూవీ వంద కోట్ల‌కి ద‌గ్గ‌ర‌లో.. రెండో రోజు ఎంత రాబ‌ట్టింది?

Hari Hara Veera Mallu : దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన‌ సినిమా విడుదల అయిన విష‌యం…

9 hours ago