YS Jagan : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా నమ్మి రైతన్నకు పెట్టుబడి సాయం రూపంలో ఆర్థిక సాధికారత అందించడమే ధ్యేయంగా మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతన్న విత్తనం నాటిన నాటి నుంచి పంటను మద్ధతు ధరకు అమ్మే వరకు తోడుగా ఉండి రైతు సుభిక్షం కోరుకునే ఏకైక ప్రభుత్వం మనదేనని వివరించారు. వైఎస్సార్ రైతు భరోసా నాలుగో ఏడాది మూడో విడత ఆర్థిక సాయం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. తెనాలిలో నిర్వహించిన ఈ బహిరంగ సభలో సీఎం జగన్ 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడో విడత సాయం అందిస్తున్న రూ. 2 వేల మొత్తాన్ని బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు. నాలుగో ఏడాదికి సంబంధించి గత రెండు విడతల్లో రూ. 7,500 మరియు రూ. 4000 ను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. మూడో విడద సాయం కింత రూ. 1090.76 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
దీంతో పాటు డిసెంబర్ లో సంభవించిన మాండూస్ తుఫాన్ కారణంగా నష్ట పోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన వన రైతులకు రూ. 76.99 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ ఆయా రైతుల ఖాతాల్లో జమచేశారు. మూడున్నరేళ్లలో 22 లక్షల రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ సాయం అందించామని వివరించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రైతు భరోసా కార్యక్రమం ద్వారా కోటిన్నర కుంటుంబాలకు మంచి జరుగుతోందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా ఒక్కో రైతన్నకు రూ. 13, 500 రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల హామీలో పేర్కొన్న రూ. 12, 500 కంటే అదనంగా మరో రూ. 1000 ను అధికారంలోకి వచ్చిన నాటి ఖచ్ఛితంగా అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద మేలో రూ. 7,500 అక్టోబర్ లో రూ. 4000 ఫిబ్రవరి రూ. 2000 అందిస్తున్నట్లు సీఎం జగన్ బహిరంగ సభలో పేర్కొన్నారు.
ఈ రోజు అందించిన సాయంతో కలిపితే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఈ నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ. 54 వేల లబ్ధి చేకూరిందని వివరించారు. వచ్చే ఏడాది అందించే మొత్తం కలిపి ఐదేళ్లలో రూ. 67,500 సాయం రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి అందించినట్లు అవుతుందన్నారు. తమ ప్రభుత్వం కేవలం రైతు భరోసా పథకం కోసమే కోసం రూ. 27,062 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. రైతులన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. వ్యవసాయం అంటే రైతుల బాగు కోరడమేనని ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పంట నష్ట పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. సాయంలో చంద్రబాబులా మాయలు, మోసాలు లేవు ఆహార భద్రతతో పాటు 62 శాతం మంది ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం అంటే వైఎస్సార్ సీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.
రైతు రైతు కూలీలతో కలిపిన వ్యవసాయం బాగుంటేనే రాష్ర్టం బాగుటుందన్నారు. రైతులకు అందించే సాయంతో కోతలు విధించి ఖర్చు తగ్గించుకునే మాయలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంత మాత్రం లేవని సీఎం జగన్ అన్నారు. ఆ మాయలు, మోసాలుకేవలం చంద్రబాబు మాత్రమే చేయగలరని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో నవరత్నాల కింద ప్రజలకు అందించిన సాయాన్ని ఒక్క సారి అందరూ గమనించాలని సీఎం జగన్ విజ్ణప్తి చేశారు. టీడీపీ హయాంలో కరువుపై యుద్ధం పేరుతో తెచ్చిన రెయిన్ గన్నుల అవినీతి లేదని, కేవలం రెయిన్ మాత్రమే ఉందని సీఎం జగన్ చలోక్తులు విసిరారు. కరువు వచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం రెయిన్ గన్నుల పేరుతో పేరుతో అవినీతికి పాల్పడటం దారుణమని సీఎం జగన్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్య మంత్రి గా ఉంటూ కరువును తోడు తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం లేనంత సుభిక్షంగా ఉండటం వైఎస్సార్ సీపీ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు.
కరువుకు కేరాఫ్ అడ్రస్.. చంద్రబాబు ఈ అన్యాయస్తుడు చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు కరువే ఉందని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రం చరిత్రలో గతాన్ని చూస్తే చంద్రబాబు కరువు మాత్రమే కనిపిస్తుందన్నారు. 2019 నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవుడి దయతో ఎక్కడా కరువులేదని వర్షాలు సుభిక్షంగా పడ్డాయని సీఎం పేర్కొన్నారు. మంచి మనసుతో పరిపాలన చేస్తే ఇలా ఉంటుందని టీడీపీకి సీఎం జగన్ చురకలంటించారు. ఈ నాలుగేళ్లలో ప్రతి ఒక్క గ్రామంలో చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయన్నారు. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం చూసినా ఎడారిగా మారుతుందని ప్రకటించిన అనంతపురం జిల్లాలో కూడా సుభిక్షంగా వర్షాలు పడ్డాయని వివరించారు. వర్షాలు పడటంతో పాటు నాలుగేళ్లలో పంట దిగుబడి 12 టన్నులు పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో పంట దిగుబడి 154 లక్షల టన్నులైతే వైఎస్సార్ సీపీ పరిపాలనలో 166 లక్షల టన్నులకు పెరిగిందన్నారు.
గత టీడీపీ పాలించిన ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నులు ధాన్యం సేకరణ చేయగా, మూడున్నరేళ్లలో తమ ప్రభుత్వం 2.94 కోట్ల ధాన్యం సేకరించామని వివిరంచారు. ధాన్యం సేకరణ కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ. 40,230 కోట్లు ఖర్చు చేస్తే రూ. 55,400 కోట్లు ఖర్చు చేసామని సీఎం జగన్ వివరించారు. రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వల్ల ఈ మూడున్నరేళ్లలో ఉద్యానవన పంటలు 1.43,900 హెక్టార్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. దిగుబడి తీసుకుంటే గతంలో ఏటా 228 లక్షల టన్నులు ఉండగా ఈ ప్రభుత్వంలో రైతన్నల కష్టం, ప్రభుత్వ క`షితో 332 లక్షల టన్నులు పెరిగిందని ఏకంగా 104 లక్షల టన్నుల అధిక దిగుబడి సాధించామని సీఎం జగన్ తెలిపారు. మన మంచి ప్రభుత్వాన్ని దేవుడు చూశాడు దేవుడు విన్నాడు, దేవుడు ఆశీర్వదించారని అందుకే ప్రతి ఇంట్లో అభివృద్ధి చూస్తున్నామని వివరించారు. దేశానికి ఆదర్శనీయంగా ఏపీలోని ఆర్బీకేలుఆర్బీకేలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని భావించడంతో పాటు, ఇతర దేశాల్లో కూడా అమలు చేయాలని ఆయా ప్రతినిధులు సందర్శించి వెళుతున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.