YS Jagan : ఈ ఒక్కటీ జరిగితే సీఎం జగన్ కు 175 గ్యారెంటీ..!
YS Jagan : నో వే… ఈసారి అన్ని అసెంబ్లీ సీట్లు వైసీపీకి దక్కాల్సిందే.. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలందరికీ సీఎం జగన్ నూరిపోస్తున్న మాట. ఏపీలో హై మార్జిన్ తో 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో వైసీపీ పనిచేస్తోంది. అంతే కాదు.. గత ఎన్నికల్లో మిస్ అయిన సీట్లను కూడా ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని వైసీపీ చూస్తోంది. అంటే ఏపీలో ఉన్న 175 సీట్లను గెలుచుకోవాలి అని పావులు కదుపుతోంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత ఇలాగా కుప్పంలో వైసీపీ పాగా వేసింది. ఎలాగైనా ఈసారి చంద్రబాబును కూడా ఓడించి కుప్పంలో వైసీపీ జెండా ఎగురువేయాలని భావిస్తోంది. నిజానికి.. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ వేరే పార్టీ విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే..
ఏపీ సీఎం వైఎస్ జగన్.. కుప్పంను టార్గెట్ చేశారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. కుప్పంలో కూడా త్వరలో పర్యటించనున్నారు. అంతే కాదు.. కుప్పంలో వైసీపీ గెలిచేలా చేయాలని దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్టుగా జగన్.. నేతలకు మాటిచ్చారట. కుప్పంలో వైసీపీ ఇన్ చార్జ్ పొజిషన్ ను ఎమ్మెల్సీ భరత్ కు ఇచ్చారు. ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధిస్తే మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు వెనుకాడనని సీఎం జగన్ మాటిచ్చారట. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అదే ఊపుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు వ్యూహాలు రచించాలని కుప్పం వైసీపీ నేతలకు సీఎం జగన్ సూచించారట.

CM Jagan if all happens to 175 guarantee
YS Jagan : స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటినప్పుడు.. ఎమ్మెల్యే ఎందుకు గెలవరు?
అంతే కాదు.. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై కూడా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం రూ.66 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అంతే కాదు.. కుప్పంలో త్వరలో సీఎం జగన్ కూడా పర్యటించబోతున్నారు. ఇంకో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అంతే కాదు.. మూడో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని కూడా సీఎం జగన్.. కుప్పంలోనే ప్రారంభించనున్నారు. ఇలా.. కుప్పం మీద సీఎం జగన్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడంతో కుప్పం చంద్రబాబు చేయి నుంచి జారిపోయి వైసీపీ ఖాతాలో పడిపోయే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.