YS Jagan : ఎమ్మెల్యేలకు జగన్ భారీ షాక్? ఎవ్వరూ ఊహించనిది?
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం దూకుడు మీదున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సూపర్ సక్సెస్. ఏపీ ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు. ఏరాష్ట్రంలోనూ లేనటువంటి సంక్షేమ పథకాలను ప్రారంభించి శెభాష్ అనిపించుకున్నారు. తను పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలతో పాటు… ఎన్నికల హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా తన విధులను తాను నిర్వర్తిస్తున్నారు. ఏపీ ప్రజలు కూడా సీఎం జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు.
అంతవరకు బాగానే ఉంది కానీ… కొన్ని అంశాల్లోనే సీఎం జగన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే భావన చాలామందిలో ఉంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరుపై సీఎం జగన్ చాలా అసంతృప్తితో ఉన్నారట. పార్టీ పరంగా వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో తెలియక జగన్ సతమతమవుతున్నారట. ఎందుకంటే… ఒక ముఖ్యమంత్రిగా తాను ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నప్పటికీ.. అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదట. ప్రజలకు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలాలు అందడం లేదట. క్షేత్రస్థాయిలో ప్రజలకు వాటి ఫలాలు అందాలంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తిరిగి…. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ… అసలు సంక్షేమ పథకాలపై చాలామంది ఎమ్మెల్యేలకే అవగాహన లేదట. అందుకే ఈ విషయంపై జగన్ సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.
YS Jagan : ఆ ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న జగన్
ఏపీలోని సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ నివేదిక తెప్పించుకున్నారట. అందులో చాలామంది ఎమ్మెల్యేలు కనీసం తమ నియోజకవర్గాల్లో కూడా కనిపించడం లేదట. అందుకే.. అటువంటి నాయకుల విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలని జగన్ నిర్ణయించుకున్నారట. వాళ్లకు ఒకసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చి… తర్వాత కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉంటే… వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సీఎం సిద్ధమవుతున్నారట. లేదంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ చార్జీలను మార్చి కొత్త వారిని ప్రకటించాలని యోచిస్తున్నారట.