Karthika Deepam 2 February 28th 2026 Today Episode : జీవితంలో దీప ఇక తల్లి కాలేదు.. కన్నతల్లి కోసం కడుపులోని బిడ్డను త్యాగం చేసిన దీప, కుప్పకూలిన దశరథ!

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 February 2026,8:30 am

Karthika Deepam 2 February 28th 2026 Today Episode : స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న బ్లాక్ బస్టర్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 రోజురోజుకూ ఊహించని మలుపులు, కంటతడి పెట్టించే ఎమోషనల్ సీన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ముఖ్యంగా సుమిత్ర ప్రాణాలు దక్కించుకోవడం కోసం దీప చేస్తున్న త్యాగం ప్రతి ఒక్కరి హృదయాన్ని బరువెక్కేలా చేస్తోంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 28, శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో కన్నీళ్లు పెట్టించే ఎన్నో ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. ఆ హైలైట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Karthika Deepam 2 February 28th 2026 Today Episode : జీవితంలో దీప ఇక తల్లి కాలేదు.. కన్నతల్లి కోసం కడుపులోని బిడ్డను త్యాగం చేసిన దీప, కుప్పకూలిన దశరథ!

Karthika Deepam 2 February 28th 2026 Today Episode : జీవితంలో దీప ఇక తల్లి కాలేదు.. కన్నతల్లి కోసం కడుపులోని బిడ్డను త్యాగం చేసిన దీప, కుప్పకూలిన దశరథ!

Karthika Deepam 2 February 28th 2026 Today Episode పారిజాతం, జ్యోత్స్నల దుర్మార్గంపై మండిపడ్డ దశరథ

ఎపిసోడ్ ప్రారంభంలోనే కార్తీక్, దశరథల మధ్య సీరియస్ సంభాషణ జరుగుతుంది. “నువ్వు ఇలాగే మిన్నకుంటే జ్యోత్స్న, పారిజాతంలు ఎంతకైనా తెగిస్తారు. అత్తకి ఏమైనా జరిగితే నీ జీవితానికి అర్ధం లేదు అన్నావు.. అలాగే దీపకు ఏమైనా జరిగితే నీ కూతురి జీవితానికి కూడా అర్ధం లేదని మర్చిపోకు” అని కార్తీక్ దశరథను హెచ్చరిస్తాడు. ఆ మాటలకు దశరథ రగిలిపోతాడు. వాళ్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, బిడ్డల్ని మార్చేయడమే కాకుండా ఇప్పుడు కడుపులోని బిడ్డను కూడా చంపాలని చూస్తారా? వాళ్ళ ముఖాలు చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటోందని దశరథ మండిపడతాడు. గతంలో దీప కిందపడబోయినప్పుడు తనకు అర్థం కాలేదని, కానీ ఇప్పుడు వాళ్ళ కుట్రలన్నీ తెలుస్తున్నాయని అంటాడు. సుమిత్రకు ఆపరేషన్ జరిగే వరకు ఓపిక పట్టాలని, ఆ తర్వాత వాళ్ళను వదిలిపెట్టేది లేదని కార్తీక్ సర్దిచెబుతాడు. ఇంతలో డాక్టర్ హారిక కాల్ చేసి దీపను తీసుకుని ఆసుపత్రికి రమ్మనడంతో, దశరథను ఇంట్లోనే ఉంచి కార్తీక్, దీపలు బయలుదేరుతారు.

Karthika Deepam 2 February 28th 2026 Today Episode స్వప్న-కాశీల విడాకులకు రంగం సిద్ధం.. దాస్ ఆవేదన

మరోవైపు శ్రీధర్ ఇంట్లో విడాకుల డ్రామా మొదలవుతుంది. కాంచన సలహా మేరకు కాశీ, స్వప్నలకు విడాకులు ఇప్పించి ఇద్దరికీ వేరే పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకుంటారు. బిడ్డల జీవితాలు విడిపోతుంటే చూడటం నరకంగా ఉందని శ్రీధర్ బాధపడతాడు. కానీ కాంచన పట్టుబట్టడంతో, దాస్‌ను ఇంటికి పిలిపిస్తాడు శ్రీధర్. కాశీ, స్వప్నలు విడిపోవాలని అనుకుంటున్నారని చెప్పడంతో దాస్ షాక్ అవుతాడు. కొడుకు కూతురు ఇద్దరూ సమానమే అని దాస్ చెప్పగా, కాశీని అడుగుతాడు. “నేను విడాకులు అడగలేదు, స్వప్న అడిగితే ఒప్పుకున్నాను” అని కాశీ సమాధానం ఇస్తాడు.

దీంతో దాస్.. స్వప్న, కాశీలను కలపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ స్వప్న ససేమిరా అంటుంది. “మా నాన్నని, అన్నయ్యని, నన్ను ఎన్నిసార్లు మోసం చేశావు? ఇంత నిజాయితీపరుడితో నేను కాపురం చేయలేను. కాగితాలు ఇస్తే సంతకాలు పెట్టేస్తాను” అని స్వప్న తేల్చి చెబుతుంది. చేతులెత్తి దండం పెట్టినా స్వప్న మనసు మారకపోవడంతో దాస్ గుండె పగిలినంత పనవుతుంది.

దీపకు డాక్టర్ హారిక షాక్.. ఆ అవకాశం ఇక ఉండదు

ఇక ఆసుపత్రికి చేరుకున్న కార్తీక్, దీపలకు డాక్టర్ హారిక ఒక గుండెలు పిండేసే నిజం చెబుతుంది. బోన్ మ్యారో ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తే ఇక వెనక్కి రాలేమని చెబుతుంది. ట్రీట్‌మెంట్‌కు తాము సిద్ధమని కార్తీక్, దీపలు చెప్పడంతో డాక్టర్ అసలు విషయం బయటపెడుతుంది. “సుమిత్ర గారికి దీప బోన్ మ్యారో ఇవ్వడం వల్ల ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డను కోల్పోవడమే కాదు.. జీవితంలో దీప మళ్లీ తల్లి అయ్యే అవకాశం కూడా ఉండదు. దీనికి మీరు ఓకేనా?” అని డాక్టర్ చెప్పగానే కార్తీక్, దీపలు ఇద్దరూ షాక్ అవుతారు. అయినా సరే, “అమ్మకు ఏమైనా జరిగితేనే పెద్ద బాధ.. దాని ముందు నేను ఈ బాధను భరిస్తాను” అని కన్నతల్లి ప్రాణాల కోసం తన మాతృత్వాన్నే త్యాగం చేయడానికి దీప సిద్ధపడుతుంది.

అసలు నిజం తెలుసుకుని కుప్పకూలిన దశరథ

కార్తీక్ కూడా బాధను దిగమింగుకుని ఆపరేషన్‌కు అంగీకరిస్తున్నట్లు డాక్టర్‌కు చెబుతాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న దశరథ.. డాక్టర్ చెప్పిన మాటలు విని షాక్ అవుతాడు. “దీప మీ కూతురు అన్న నిజం నాకు తెలుసు” అని డాక్టర్ హారిక చెప్పడంతో, “నా భార్యను కాపాడటానికి నా కూతురు తన కడుపులోని బిడ్డను వదులుకుంటుందా?” అని దశరథ కన్నీరుమున్నీరవుతాడు. డాక్టర్ అవునని చెప్పడంతో అతడు కుప్పకూలిపోతాడు.

“బిడ్డను కాపాడాలంటే దీప డోనర్‌గా ఉండకూడదు, కానీ అలా చేస్తే సుమిత్ర గారు బతకరు. ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోవడమే సొల్యూషన్” అని డాక్టర్ తెగేసి చెబుతుంది. నా కళ్ల ముందు ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని దశరథ తనను తాను నిందించుకుంటూ విలపిస్తాడు. తన భార్య ప్రాణాలా? కూతురి భవిష్యత్తా? అన్న సందిగ్ధంలో దశరథ నలిగిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరగనుందో తెలుసుకోవాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి