Ysr Kalyanamastu : నేడు వైయస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా పథకాలు అమలు చేయనున్న సీఎం జగన్.. ఎవరికి వర్తిస్తుందో ఫుల్ డీటెయిల్స్..!!
Ysr Kalyanamastu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్..ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని దాదాపు 90 శాతానికి పైగా అమలు చేస్తూ ఉన్నారు. విభజనతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిన కేంద్రం సహకరించకపోయినా.. ఉన్నదానిలోనే సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటూ పరిపాలన ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రారంభంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అమలు చేయకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ ప్రతిపక్షాలకు ఇవ్వకుండా ఈరోజు ఈ హామీ నెరవేర్చడానికి వైయస్ జగన్ ప్రభుత్వం రెడీ అయింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ఆర్థిక సాయాన్ని నేడు ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. నేరుగా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో వెళ్లేలా బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.గత ఏడాది అక్టోబర్ మొదటి తారీకు నుంచి డిసెంబర్ 31 వ తారీకు వరకు వివాహాలు చేసుకున్న యువతులకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 4,536 మంది లబ్ధిదారులకు 38.18 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం మొదటి పెళ్లి చేసుకున్న వారికి మాత్రమే. పెళ్లయి 60 రోజులలోపు అర్హులైన వారు వైయస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫాకి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వాళ్లు సంబంధిత పత్రాలతో గ్రామ వార్డు సచివాలయాలలో ఇతర వివరాలను తెలియజేసి దరఖాస్తు చేసుకోవాలి. పేదింటి యువతకు గౌరవప్రదంగా వివాహం జరిపేందుకు ఈ పథకం తీసుకొచ్చినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, బీసీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. వైయస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. ఇదే సమయంలో ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు కులాంతర వివాహం చేసుకుంటే లక్ష ఇరవై వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలకు 50,000 కులాంతర వివాహం చేసుకుంటే ₹75,000 కానుకగా ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు 40 వేల రూపాయలు, మైనారిటీల వివాహాలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద లక్ష, దివ్యాంగుల వివాహాలకు రూ. లక్షా 50వేల రూపాయలు కానుకగా ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది.
పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి…కన్న తల్లిదండ్రులకు భారం కాకుండా వైసిపి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పథకానికి కొన్ని నిబంధనలు కూడా వైసీపీ ప్రభుత్వం పెట్టడం జరిగింది. వైయస్సార్ కళ్యాణమస్తు పథకం అప్లై చేసుకునే అమ్మాయి వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 ఏళ్లు, అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఖచ్చితంగా కనీసం పదోతరగతి చదివి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలకు వర్తించదు. ఇంకా నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 10వేలు, పట్టణ ప్రాంతాలలో 12 వేలకు మించకుండా ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తది. మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు మాత్రమే అర్హులు. ఇంక నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు అనర్హులు. కానీ ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లు, ఇంట్లో 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం చేసేవారు కూడా అనర్హుల జాబితా లెక్కలో తేల్చారు. నేడు ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.