Nick Vujicic – YS Jagan : వైఎస్ జగన్ తో మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ భేటీ !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nick Vujicic – YS Jagan : వైఎస్ జగన్ తో మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ భేటీ !!

 Authored By kranthi | The Telugu News | Updated on :3 February 2023,9:00 pm

Nick Vujicic – YS Jagan : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ తెలుసు కదా. ఆయనకు పుట్టుకతోనే కాళ్లు లేవు. కేవలం నడుము వరకు మాత్రమే ఆయన బాడీ ఉంటుంది. ఆయన తాజాగా ఏపీకి వచ్చారు. ఏపీకి వచ్చి సీఎం జగన్ ను మీట్ అయ్యారు. జగన్ తో విద్యా వ్యవస్థ గురించి ఆయన చర్చించారు. ఏపీలోని పలు పాఠ్య పుస్తకాల్లో నిక్ గురించి చేర్చారు. దానిపై ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు.

world motivational speaker nick vujicic meets ap cm ys jagan

world motivational speaker nick vujicic meets ap cm ys jagan

అయితే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు నిక్. ఇప్పటి వరకు తాను 78 దేశాల్లో పర్యటించినా ఎక్కడా ఏపీలో అవలంభిస్తున్న విధానాలు లేవని.. ఇక్కడ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. తాను గుంటూరులోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించారు. దీంతో అక్కడ విద్యార్థినులు స్పష్టమైన ఇంగ్లీష్ లో మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయారు.

ys jagan mohan reddy, Nick Vujicic: ముఖ్యమంత్రి జగన్‌తో నిక్‌ వుజిసిక్ భేటీ  - nick vujicic met chief minister jagan mohan reddy - Samayam Telugu

 

Nick Vujicic – YS Jagan : ఏపీని చూసి నేను ప్రేరణ పొందా

చాలామంది తన మోటివేషనల్ వీడియోలను చూసి ప్రేరణ పొందుతారని చెప్పిన నిక్.. ఇప్పుడు తానే ఏపీని చూసి ప్రేరణ పొందానని చెప్పారు. సీఎం జగన్ హీరో అని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంత మంచి సదుపాయాలు కల్పించడం చాలా గ్రేట్ అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని ఇది స్ఫూర్తి దాయకం అని ఆయన వెల్లడించారు. ఇంత నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. అలాంటి వ్యక్తిని కలవడం గౌరవంగా భావిస్తున్నా అని చెప్పారు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది