CM Jagan : విశాఖ గ్లోబల్ సమిట్ వేదికగా మూడు రాజధానుల పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Jagan : విశాఖ గ్లోబల్ సమిట్ వేదికగా మూడు రాజధానుల పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :3 March 2023,5:00 pm

CM Jagan : విశాఖపట్నం వేదికగా ఇవాళ రేపు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం జరగనుంది. ఈరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని అద్భుత రేతిలో ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇచ్చిన స్పీచ్ లో మూడు రాజధానులపై క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యాపారవేత్తలు మరియు వేలాది మంది అతిథుల మధ్య విశాఖపట్నం గొప్పదనం గురించి చెబుతూ రాష్ట్రానికీ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నగరంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

cm jagans comments on three capitals

cm jagans comments on three capitals

గతంలో కూడా ఢిల్లీ వేదికగా సీఎం జగన్ ఈ కామెంట్లు చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. జనవరి 31 వ తారీకు ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అందర్నీ ఆహ్వానిస్తూ విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుందని త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ కాబోతున్నట్లు తెలిపారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక ఇదే సమయంలో ఉత్తరాంధ్రాకి చెందిన వైసీపీ కీలక నాయకుల సైతం విశాఖ రాజధానిగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఉగాది పండుగ నుండి విశాఖపట్నం వేదికగా పరిపాలన సాగుతుందని మరి కొంతమంది వ్యాఖ్యానించడం జరిగింది.

CM Jagan: మూడు రాజధానులపై సీఎం జగన్‌ మరోసారి స్పష్టత.. గ్లోబల్‌ సమ్మిట్ వేదికగా కీలక వ్యాఖ్యలు.

కొత్త విద్యా సంవత్సరం నాటికి విశాఖ పూర్తి పరిపాలన రాజధానిగా కార్యకలాపాలు మొదలవుతాయని తెలియజేశారు. అయితే మూడు రాజధానులు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అమరావతి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మార్చి 28వ తారీఖు నాడు విచారణకు రావాల్సి ఉంది. అయితే ముందుగానే విచారణకు తీసుకోవాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును కోరింది. ఈ క్రమంలో మూడు రాజధానుల మేటర్ కోర్టు పరిధిలో ఉండగా మరోసారి విశాఖ వేదికగా.. అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో వైఎస్ జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కామెంట్లు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది