CM KCR : నలభై వేల కోట్ల కోసం భారీ ప్లాన్ సిద్ధం చేసిన కే‌సీఆర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM KCR : నలభై వేల కోట్ల కోసం భారీ ప్లాన్ సిద్ధం చేసిన కే‌సీఆర్..!

 Authored By kranthi | The Telugu News | Updated on :25 November 2022,10:10 pm

CM KCR : దేశంలోనే చాలా ధనవంత రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ.. తెలంగాణలో చూస్తే పరిస్థితులు మాత్రం అలా లేవు. అవును.. సీఎం కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణ నిజంగానే బంగారు తెలంగాణగా ఉందా.. లేక అప్పుల తెలంగాణగా మారిందా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోంది. దానికి కారణం.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు. వాళ్లకు ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంటే.. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని అనుకోవాల్సిందే కదా.

అందుకే.. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పోరాడుతోంది. కేంద్రం కూడా కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంతో ఢీ అంటే ఢీ అని కేసీఆర్ అంటుండటంతో కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధం అంటోంది. ఈనేపథ్యంలో కేసీఆర్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై పడుతోంది. దీనివల్ల రాష్ట్రం ఇంకా అప్పులపాలు అవుతోందని మేధావులు వాపోతున్నారు. అయితే.. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.40 వేల కోట్లు రావాల్సి ఉందని తెలుస్తోంది. అవి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు అని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ..

cm kcr big plan to get 40 thousand crores

cm kcr big plan to get 40 thousand crores

CM KCR : కేంద్రం నుంచి తెలంగాణకు 40 వేల కోట్లు రావాలా?

అవి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు కాదు.. తేవాల్సిన అప్పులు అని అంటున్నారు. ఎందుకంటే.. గ్యారెంటీ రుణాలు తీసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఇంకా ఇలాగే అప్పులు తెస్తూ పోతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుపడే ప్రమాదం ఉంది. ఎఫ్ఆర్బీఏం పరిమితికి మించి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అప్పు చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా రాష్ట్రం చేసిన అప్పు కిందికే వస్తుందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో వచ్చే నెల నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ సీఎం కేసీఆర్ కత్తులు, మిరియాలు నూరుతారా? అనేది వేచి చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది