Barrelakka Vs CM KCR : కేసీఆర్ కే సవాల్ విసిరిన బర్రెలక్క.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Barrelakka Vs CM KCR : కేసీఆర్ కే సవాల్ విసిరిన బర్రెలక్క.. వీడియో !

 Authored By anusha | The Telugu News | Updated on :24 November 2023,1:10 pm

ప్రధానాంశాలు:

  •  Barrelakka Vs CM KCR : కేసీఆర్ కే సవాల్ విసిరిన బర్రెలక్క.. వీడియో !

  •  కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి

  •  Barrelakka kollapur assembly constituency

Barrelakka Vs CM KCR : సోషల్ మీడియా Social Media ద్వారా బర్రెలక్క Barrelakka ఫుల్ ఫేమస్ అయ్యారు. గతంలో ఉద్యోగం లేక గేదెలు కాస్తున్నానంటూ చేసిన వీడియోతో శిరీష బర్రెలక్కగా  Barrelakka Shirisha  స్థిరపడిపోయారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆమె కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం kollapur assembly constituency నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడమే. నాగర్ కర్నూలు Nagarkurnool జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నారు. నిరుద్యోగ అంశమే ప్రధానంగా ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. ఇటీవల కొల్లాపూర్ నియోజక వర్గం ప్రచారంలో భాగంగా బర్రెలక్క మాట్లాడుతూ.. నువ్వు ఒక ఆడపిల్లవి నువ్వు ఏమి చేయలేవు అన్నారు.

చాకలి ఐలమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి వీరంతా ఎవరు.. ? మాది చాలా పేద కుటుంబం. డిగ్రీ చదివాను. ఉద్యోగం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందుకే పోరాడుదామని కొల్లాపూర్ నియోజకవర్గంలో నామినేషన్ వేశాను. దీంతో నన్ను భయపెట్టించారు. నామినేషన్ విత్ డ్రా చేసుకో, నీకు కావలసినంత డబ్బు ఇస్తామని బెదిరించారు. అయినా నేను భయపడను కొల్లాపూర్ ప్రజల సమస్యలను తీర్చడానికి ముందుకొచ్చాను. ఈల గుర్తుకే ఓటు వేయండి అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ BRS Party ప్రచారంలో భాగంగా కేసీఆర్ KCR కొల్లాపూర్ నియోజక వర్గం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ..లగతంలో కొల్లాపూర్  kollapur ఎట్లుండేది. పెద్దకొత్తపల్లి కి అప్పుడు ముంబై బస్సులు ఎక్కువగా ఉండేవి. అక్కడ ఉండే కుంఫు మేస్త్రిలంతా ముంబైకి పని కోసం వెళ్లేవారు. గతంలో అట్లా ఉండే కొల్లాపూర్ ఇప్పుడు ఎలా ఉంది. ఎవరో వచ్చి చెబుతా ఆగమవుతారా, అలా మాట్లాడడానికి సిగ్గుండాలి అని ఆయన అన్నారు. గతంలో ఇందిరమ్మ తెలంగాణను వెనకబడ్డ రాష్ట్రం అని, మీరు కేవలం జొన్నలు మాత్రమే పండించుకోవాలని అనేవారు. మీకు నీళ్లు రావు, వడ్లు పండవు, తెలివి కూడా లేదు అని అనేవారు.

కానీ ఇవాళ Telangana తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. కొల్లాపూర్ లోనే లక్ష 25 వేల ఎకరాలలో వడ్లు పండుతున్నాయి ఇదంతా తెలంగాణ వచ్చాకే సాధ్యమైంది. గతంలో కొల్లాపూర్ లో మంచినీళ్లు కూడా లేవు. పక్కనే కృష్ణా నది ఉన్న కొల్లాపూర్ కి నీళ్లు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ Congress పార్టీ. కరెంటు ఇచ్చారా. .2000 పెన్షన్ ఇచ్చారా.. ఇదంతా మీరే ఆలోచించాలి ఇవి ఓట్లు కాదు తెలంగాణ బ్రతుకుతెరువు పోరాటం అని ఆయన అన్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది