Sagar by poll : ఆ నేతకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేసీఆర్.. సాగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే కీలక పదవి?
Sagar by poll : ప్రస్తుతం తెలంగాణలో ఒకటే చర్చ. సాగర్ ఉపఎన్నిక గురించి. ఈనెల 17న సాగర్ ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇంకో రెండు రోజులు తెలంగాణలో ఇదే చర్చ. అసలే సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి మరీ ప్రచారం చేస్తున్నారు అంటే సాగర్ ఉపఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం అవుతోంది. సాగర్ ఉపఎన్నికను అన్ని పార్టీలు చాలెంజింగ్ గా తీసుకోవడంతో.. ప్రచారం కూడా చాలా జోరుగానే జరిగింది. ప్రచారంలో అన్ని పార్టీలు చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. ప్రచార సమయం ముగుస్తుండటంతో… వాటి జోరును పెంచాయి.
అయితే.. నాగార్జున సాగర్ సీటు… టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికల్లో ఓడిపోయి.. తన సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. అది నిజంగా టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బే. అందుకే… అక్కడ చేసిన తప్పులు ఇక్కడ చేయకుండా టీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి హాలియాలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. నిజానికి.. సీఎం కేసీఆర్… గత ఫిబ్రవరిలోనే హాలియాలో బహిరంగ సభను నిర్వహించారు. అయినప్పటికీ… మరోసారి తాజాగా హాలియాలో బహిరంగ సభను నిర్వహించారంటే.. సాగర్ ఉపఎన్నికను కేసీఆర్ ఎంత చాలెంజింగ్ గా తీసుకున్నారో అర్థం అవుతోంది.
Sagar by poll : కోటిరెడ్డికి బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్
అయితే… నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో నోముల భగత్ గెలుపు కోసం హైకమాండ్ దగ్గర్నుంచి.. సాగర్ కు చెందిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు విపరీతంగా కష్టపడుతున్నారు. సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఈనేపథ్యంలో సాగర్ ఉపఎన్నికల్లో భగత్ గెలుపు కోసం… ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య అనే ఇద్దరు సాగర్ కు చెందిన టీఆర్ఎస్ నాయకులు చాలా కష్టపడుతున్నారని… మంచిగా పనిచేస్తున్నారని హాలియా సభలో సీఎం కేసీఆర్ కొనియాడారు. సీఎం కేసీఆర్ నోటి నుంచి కితాబు రావడం అంటే మామూలు విషయం కాదు. కానీ.. ఇద్దరి గురించి గొప్పగా చెప్పడంతో పాటు… కోటిరెడ్డికి బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు కేసీఆర్. భగత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే…. కోటిరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని మాటిచ్చారు. అది.. అలా కోటిరెడ్డికి బంపర్ ఆఫర్ దొరికిందన్నమాట.