
cm kcr different strategy to dismiss minister etela rajender from ministry
Etela Rajender : తెలంగాణలో ప్రస్తుతం ఓవైపు కరోనా కోరలు చాచింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. చాలా రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ మధ్య చాలా గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. అసలు.. తెలంగాణ ప్రజలంతా కరోనా వ్యాప్తి విషయంలో బెంబేలెత్తిపోతున్న సమయంలో సడెన్ గా ఈటల రాజేందర్ విషయం బయటికి వచ్చింది. మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రి పదవి నుంచి తప్పించనున్నారని తెలుస్తోంది.
cm kcr different strategy to dismiss minister etela rajender from ministry
మెదక్ జిల్లాలోని మాసాయిపేట సమీపంలో సుమారు 100 ఎకరాల భూమి విషయంలో ప్రస్తుతం మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణలు వస్తున్నాయి. మీడియాలో కూడా కథనాలు పుంఖానుపుంఖలుగా వస్తున్నాయి. మంత్రి ఈటల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో పాటు… అక్కడి రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దీంతో ఈ విషయం సీరియస్ అయింది. సీఎం కేసీఆర్ కు కొందరు రైతులు ఈ విషయంపై లేఖ రాయడంతో వెంటనే విచారణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
నాలుగేళ్ల కింద 100 ఎకరాల భూమి విషయంలో మంత్రి ఈటల రాజేందర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే.. ఇటీవల అక్కడ రోడ్డు వేయడానికి రైతులతో మంత్రి రాజీ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దానిపై కొందరు రైతులు వ్యతిరేకించడం, సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం జరిగినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చాలారోజుల నుంచి మంత్రి ఈటల కూడా పార్టీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆ మధ్య సీఎం కేసీఆర్ తో మంత్రి కేటీఆర్.. ఈటలను కలిపించారు. కేసీఆర్, ఈటల ఇద్దరు కలిసి కాసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత చాలాసార్లు మంత్రి ఈటల కూడా రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్.. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 100 ఎకరాల భూకబ్జా విషయంలోనే సీఎం కేసీఆర్.. ఈటలను మంత్రవర్గం నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారట. మీడియాలో కూడా ఈటలకు సంబంధించిన భూమి వ్యవహారంపై కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే.. దీనిపై ఈటల రాజేందర్ మాట్లాడనున్నారు. కాసేపట్లో ఈటల మీడియాతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అయితే… ఆయన ఏ విషయంపై మాట్లాడుతారో మాత్రం తెలియదు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.