CM KCR : మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్
CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ ఏడాది బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి భారీ ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలను, రైతులను ఆకట్టుకునే రీతిలో పలు పథకాలకీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే భూమిలేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని
ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని గిరిజన కుటుంబాలను ఈ గిరిజన బందు ద్వారా ఆదుకుంటామని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడుతూ కేసీఆర్ ఈ ప్రకటన చేయడం జరిగింది. ఛత్తిస్ ఘడ్ కు చెందిన గుత్తి కోయలు తెలంగాణకు వలస వచ్చి అధికారులపై జులం చేయటం సరికాదని హెచ్చరించారు.
వారు భూమిని ఆక్రమిస్తే అడ్డుకోకపోయినా ఫారెస్ట్ అధికారిని పట్టపగలే చంపటం ఎంతవరకు సమంజసం అని కెసిఆర్ నిండు సభలో ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే దళిత బంధు పథకం ద్వారా దళితులకు భారీ ఎత్తున మేలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో గిరిజన కుటుంబాలను అన్ని రకాలుగా పైకి తీసుకురావడానికి గిరిజన బంధు పథకం కింద భూములు ఇవ్వటానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది.