Sagar bypoll : జానారెడ్డి సవాల్ తోనే సాగర్ ఉపఎన్నిక రంగంలోకి కేసీఆర్… కేటీఆర్ రోడ్ షోలు రద్దు? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sagar bypoll : జానారెడ్డి సవాల్ తోనే సాగర్ ఉపఎన్నిక రంగంలోకి కేసీఆర్… కేటీఆర్ రోడ్ షోలు రద్దు?

Sagar bypoll : ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది నాగార్జున సాగర్ ఉపఎన్నిక గురించే. ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం నాగార్జునసాగర్ మీదనే పెట్టాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే.. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే….. సాగర్ ఉపఎన్నిక పోరు కేవలం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే. ఇతర […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :10 April 2021,10:55 am

Sagar bypoll : ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది నాగార్జున సాగర్ ఉపఎన్నిక గురించే. ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం నాగార్జునసాగర్ మీదనే పెట్టాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే.. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే….. సాగర్ ఉపఎన్నిక పోరు కేవలం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే. ఇతర పార్టీలు ఉన్నా.. వీటి తర్వాతనే. సాగర్ లో బీజేపీ పప్పులు ఉడకడం లేదు. దుబ్బాకలో విజయదుందుబి మోగించినప్పటికీ… సాగర్ లో బీజేపీకి అంత సీన్ లేదు… అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పోటీ కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే.

cm kcr to campaign in sagar bypoll with janareddy challenge

cm kcr to campaign in sagar bypoll with janareddy challenge

కాంగ్రెస్ తరుపున పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఆ తర్వాత జనగర్జన సభ పెట్టి.. జానారెడ్డి డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ ను అభివృద్ధి చేసింది నేను…. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ సాగర్ లో ఏం చేసింది? ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలి అంటూ కేసీఆర్ కే డైరెక్ట్ గా జానారెడ్డి సవాల్ విసిరారు. ఓవైపు సీనియర్ నేత. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. మంత్రగా కూడా పనిచేసిన నేత డైరెక్ట్ గా సీఎంను విమర్శించడంతో… అది పెద్ద రాజకీయ దుమారం లేపింది. జానారెడ్డి సవాల్ విషయంలో సీఎం కేసీఆర్ కాకుండా మరెవరు రెస్పాండ్ అయినా… జానారెడ్డిని విమర్శించినా అది టీఆర్ఎస్ పార్టీకే నష్టం కలిగిస్తుందని భావించి… జానారెడ్డి సవాల్ కు ప్రతి సవాల్ విసరడానికి ఏకంగా సీఎం కేసీఆరే సాగర్ ఉపఎన్నిక బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.

Sagar bypoll : జానారెడ్డి కోసమే మరోసారి సాగర్ కు కేసీఆర్?

నిజానికి సీఎం కేసీఆర్… గత ఫిబ్రవరి 10వ తేదీన హాలియాలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి హామీల వర్షం కురిపించారు. సాగర్ ను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని సీఎం మాటిచ్చారు. కానీ… సాగర్ ఉపఎన్నిక ప్రచారం కోసం మరోసారి సాగర్ కు రానున్నారు కేసీఆర్. ఈనెల 14న మళ్లీ అదే హాలియాలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.

వాస్తవానికి అసలు ఉపఎన్నికలకు సీఎం కేసీఆర్ ప్రచారమే చేయరు. గతంలో జరిగిన ఉపఎన్నికలకు కూడా కేసీఆర్ ప్రచారం చేసింది లేదు. కానీ.. ఈ ఎన్నిక కోసం రెండో సారి హాలియాకు వెళ్తున్నారంటే… అది సాగర్ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకోవడం వల్లనే అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే… మంత్రి కేటీఆర్ రోడ్ షోలను కూడా రద్దు చేశారని తెలుస్తోంది. నిజానికి ఈనెల 13, 14 న సాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించి ప్రచారం చేస్తారని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కానీ.. కేటీఆర్ రోడ్ షోలను రద్దు చేసి కేవలం సీఎం కేసీఆర్ బహిరంగ సభనే 14న నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈఎన్నికల్లో జానారెడ్డిని ఓడించాలంటే.. వ్యూహాలు ఎంతో పకడ్బందీగా ఉండాలని అంచనా వేసిన టీఆర్ఎస్ పార్టీ.. అంతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చూద్దాం మరి… సాగర్ సీటు ఎవరికి రాసి పెట్టి ఉందో?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది