Anudeep Durishetty : శభాష్ అనుదీప్ దురిశెట్టి.. కలెక్టర్ భార్య ప్రభుత్వలో ఆస్పత్రి పురుడు..
Anudeep Durishetty : ప్రభుత్వ వ్యవస్థలపై రోజురోజుకూ నమ్మకం పోతున్న క్రమంలో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పెంచేందుకు కొంత మంది అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తన వైఫ్ ప్రసవాన్ని గవర్నమెంట్ ఆస్పత్రిలోనే చేయించి ప్రత్యేకతను చాటుకున్నారు.ఇటీవల కాలంలో చాలా మంది ప్రతీ చిన్న విషయానికి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న తరుణంలో తాను జిల్లా కలెక్టర్ అయి ఉండి అనుదీప్..తన భార్యను ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడం గొప్ప విషయమని చాలా మంది అంటున్నారు.
ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పెంచేందుకు అనుదీప్ చేసిని పని ఉపయోగ పడుతుందని పేర్కొంటున్నారు. తెలంగాణలోనే పుట్టి పెరిగిన అనుదీప్.. తెలంగాణ కేడర్‌కే ఐఏఎస్‌గా ఎంపికై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేవలందిస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ ప్రథమ మహిళ మాధవి భద్రాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని కలెక్టర్‌ను అందరూ అభినందిస్తున్నారు. దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి తొలి కాన్పు భద్రాచలం ఏరియా వైద్యశాలలో జరిగింది. స్త్రీ వైద్య నిపుణులు గైనకాలజిస్టు సూరపనేని శ్రీక్రాంతి, డాక్టర్ భార్గవి, అనస్థీషియా వైద్య నిపుణులు దేవికల ఆధ్వర్యంలో మాధవికి ఆపరేషన్ చేశారు.
Anudeep Durishetty : కలెక్టర్‌పై ప్రశంసల వర్షం..
అనంతరం శిశువుకు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై.రాజశేఖర్ రెడ్డి వైద్యం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌పై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించేందుకే కలెక్టర్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. కాగా, కలెక్టర్ తన భార్యను ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించడం తెలుసుకుని చాలా మంది అధికారులు, అనధికారులు, ప్రజలు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన అనుదీప్ దురిశెట్టి 2017లో జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ముస్సోరిలో ట్రైనింగ్ తర్వాత అనుదీప్‌కు పోస్టింగ్ తెలంగాణలోనే రావడం విశేషం. ఇటీవల ఖమ్మం డిస్ట్రిక్ట్ అదనపు కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ దవాఖానాలోనే పురుడు పోసుకున్న సంగతి తెలిసిందే.