KCR : వార్నీ.. ఆ ఎమ్మెల్సీ ఏంది? కేసీఆర్ ను అంత మాట అనేశాడు?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 13 February 2021, 6:56 pm

KCR: సీఎం కేసీఆర్ మొన్న హాలియా సభలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవి వైరల్ అవడమే కాదు.. ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆ వ్యాఖ్యలను ఆసరా చేసుకొని కేసీఆర్ పై లేనిపోని బురద జల్లుతున్నారు.

congress mlc jeevan reddy shocking comments on cm kcr

congress mlc jeevan reddy shocking comments on cm kcr

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, నాగం జనార్ధన్ రెడ్డి కూడా కేసీఆర్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

KCR : కుక్కులకు విశ్వాసం ఉంది.. కానీ?

కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి చెప్పుతో సమానమట. కేసీఆర్ కు అహంకారం ఎక్కువైంది. కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా కేసీఆర్ కు లేదు.. ముందు ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడితే మంచిది. సొంత కొడుకు కేటీఆరే కేసీఆర్ ను పదవి నుంచి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ను పదవి నుంచి దింపే వరకు కేటీఆర్ వదలడు.. అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.

congress mlc jeevan reddy shocking comments on cm kcr

congress mlc jeevan reddy shocking comments on cm kcr

KCR : మహిళలను కుక్కతో పోల్చుతారా?

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలను కుక్కలతో పోల్చుతారా? అంటూ మరో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు అహంకారం పెరిగింది. అసలు.. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. ఈ కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవారు.. అంటూ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి