Revanth Reddy : ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించడానికి అసలు కారణం అదే? గుట్టు బయటపెట్టిన రేవంత్ రెడ్డి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించడానికి అసలు కారణం అదే? గుట్టు బయటపెట్టిన రేవంత్ రెడ్డి?

Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఆయన విమర్శించారు. ఆయన తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం కావాలని.. కరోనా కేసులను తగ్గించి చూపిస్తోంది. అందుకే రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్లు, మెడిసిన్లను కేంద్రం ఎక్కువ మొత్తంలో కాకుండా.. తక్కువగా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 May 2021,8:55 pm

Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఆయన విమర్శించారు. ఆయన తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం కావాలని.. కరోనా కేసులను తగ్గించి చూపిస్తోంది. అందుకే రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్లు, మెడిసిన్లను కేంద్రం ఎక్కువ మొత్తంలో కాకుండా.. తక్కువగా పంపుతోంది. అసలు.. కరోనా వ్యాక్సిన్ తయారయ్యేదే తెలంగాణలో. కానీ.. తెలంగాణలోనే కరోనా వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది. తెలంగాణలో తయారవుతున్నప్పుడు.. తెలంగాణ అవసరం తీరకుండా… బయటికి ఎలా పంపిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లపై సీఎం కేసీఆర్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసేదే రెండు కంపెనీలు. మరే ఇతర కంపెనీలకు అనుమతి ఇవ్వలేదు. మరి.. రెండు కంపెనీలే వ్యాక్సిన్లను తయారు చేస్తుంటే.. ఎందుకు గ్లోబల్ టెండర్లను పిలుస్తున్నారు.. అంటూ రేవంత్ రెడ్డి Revanth Reddy ప్రశ్నించారు.

congress mp revanth reddy press meet

congress mp revanth reddy press meet

Revanth Reddy : కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కేసీఆర్ బంధువులవే అయినప్పుడు.. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చుతారు?

తెలంగాణలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కేసీఆర్ బంధువులవే. అటువంటప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చుతారు. అందుకే చేర్చడం లేదు. అలాగే… వ్యాక్సిన్ కొనుగోలుపై, కరోనా మందులపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీలో ఉన్న సభ్యులు మరెవరో కాదు.. మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో అధికారి రాజశేఖర్ రెడ్డి. వీళ్లంతా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఇక.. మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ అయితే.. ఎక్కడ చూసినా ఉండారు కానీ.. కరోనాను నియంత్రించడంలో మాత్రం శూన్యం. కొనుగోళ్లు అంటే చాలు.. కేటీఆర్ వచ్చేస్తారు. అంతే… కేటాయింపులు, కొనుగోళ్లు అంటే ముందుండేది ఇద్దరే ఇద్దరు.. ఒకరు కేటీఆర్, మరొకరు హరీశ్ రావు. అసలు.. దోపిడీ కోసం, దోచుకోవడం కోసం వెసులుబాటు ఉన్న ఏ మంత్రిత్వ శాఖ అయినా కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉంటుంది. అందుకే కదా.. ఈటలను తొలగించింది.. ఈటలను తొలగించడానికి కారణం కూడా అదే.. అంటూ రేవంత్ రెడ్డి Revanth Reddy ఎద్దేవా చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది