Coolie vs War 2 | రజనీకాంత్ ‘కూలీ’ vs ఎన్టీఆర్-హృతిక్ ‘వార్ 2.. బెంగళూరులో వార్ 2 షోలు క్యాన్సిల్!
Coolie vs War 2 | భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు రజనీకాంత్ నటించిన “కూలీ” మరియు హృతిక్ రోషన్-జూనియర్ ఎన్టీఆర్‌ల “వార్ 2. ఈ రెండు చిత్రాలు ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. పంద్రాగస్టు లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో విడుదలవుతున్న ఈ రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాలకు ఇప్పటికే బజ్ ఊపందుకుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో రజనీ మానియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

#image_title
నార్త్ అమెరికాలో ‘కూలీ’ ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు (సుమారుగా ₹176 కోట్లు) వసూలు చేసింది.
వార్ల 2కు పోలిస్తే బజ్ తక్కువగానే కనిపిస్తోంది. కానీ విడుదల తరువాత మూవీ కంటెంట్ బలమై నిలుస్తుందేమోనన్నది చూడాలి. బాక్సాఫీస్ వర్గాల అంచనా ప్రకారం, ‘కూలీ’ ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాయబోతోంది.విభిన్న భాషల ప్రేక్షకులలో ఉన్న రజనీ క్రేజ్ ఈ సినిమాకు వరం కావొచ్చు.మరోవైపు, ఎన్టీఆర్ హిందీ తెరపై ఎలా ఆకట్టుకుంటాడోనన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది.
కర్ణాటకలో కూలీ ప్రభంజనానికి తట్టుకోలేకపోతుంది వార్ 2. ఇప్పటికే కూలీ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నది. అయితే వార్ 2 సినిమాకు బెంగళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం, పేలవంగా ఆక్యుపెన్సీ ఉండటంతో షోలు క్యాన్సిల్ చేసి.. కూలీ సినిమాకు కేటాయిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.. అయితే ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ థియేటర్లతో వార్ 2 ఒప్పందం కుదుర్చుకొన్నది. అయితే ఆ అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసి బెంగళూరులో కూలీ సినిమాకు థియేటర్‌ను కేటాయించడం సెన్సేషన్‌గా మారడమే కాకుండా రజనీ మానియా ఏమిటో చెప్పింది. వార్ 2 చిత్రం నార్త్ ఇండియాలో కూడా ప్రభావం చూపలేకపోతున్నది