AP TRANSCO Jobs : ఏపీ ట్రాన్‌కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు.. నెలకు రూ.1,20,000 జీతం
ప్రధానాంశాలు:
AP TRANSCO Jobs : ఏపీ ట్రాన్‌కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు.. నెలకు రూ.1,20,000 జీతం
AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 కార్పొరేట్ లాయర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
AP TRANSCO Jobs ఖాళీల వివరాలు
కార్పొరేట్ లాయర్ : 05 పోస్టులు
అర్హతలు : మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ/ ఎల్‌ఎల్‌ఎం లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ఉత్తీర్ణతతో పాటు నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి
వయో పరిమితి : వయో పరిమితి లేదు

AP TRANSCO Jobs : ఏపీ ట్రాన్‌కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు.. నెలకు రూ.1,20,000 జీతం
ప్రొఫెషనల్ ఫీజు : నెలకు రూ.1,20,000
ఎంపిక విధానం : విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా
బాధ్యతలు : ప్రతిరోజూ కార్పొరేట్ కార్యాలయంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒప్పందాల ముసాయిదాలు, చట్టపరమైన కేసుల విచారణలు, పారా వైజ్ రిమార్క్‌లను సిద్ధం చేయడం, హైకోర్టు, ఇతర న్యాయస్థానాలు ఏదైనా సంబంధిత అధికారులు అప్పగించిన ఇతర పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. విజయవాడలోని విద్యుత్ సౌధలో పని చేసేందుకు రెడీగా ఉండాలి. అభ్యర్థి విజయవాడలో ఉండడం తప్పనిసరి.
దరఖాస్తు ప్రక్రియ : ఆఫ్‌లైన్ దరఖాస్తులు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 21 రోజులలోపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ సౌధ, గుణదల, విజయవాడ చిరునామాకు పంపించాలి.
నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ : 19.11.2024. Corporate Lawyer Posts in AP TRANSCO , AP Transco Posts, AP TRANSCO, Corporate Lawyer