Costly Toddy : తెలంగాణలోని జనాలకు కల్లు తాగే సంప్రదాయం ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ కల్లుకు జనరల్‌గా అయితే వందనో లేదా రెండొందలో ఉంటుంది. అలా కల్లు తక్కువ ధరకు దొరుకుతుంటుంది. కానీ, మనం తెలుసుకోబోయే ఈ కల్లు మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడ బాటిల్ కల్లు ధర రూ.500. దానికి తోడు ఈ కల్లును ముందు రోజు బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది. ఇంతకీ ఆ కల్లు ఎక్కడుంది? దానిలో విశేషాలేంటనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కల్లు సాధారణ కల్లు కంటే కూడా కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. రెడీ మేడ్ గా దొరికే ఆల్కహాల్ కంటే ప్రకృతిలో దొరికే కల్లు తాగడం వలన చక్కటి ప్రయోజనాలుంటాయని పెద్దలు చెప్తుంటారు కూడా. దాంతో జనం కూడా తెల్లవారగానే కల్లుకు క్యూ కడుతుంటారు. అలా ప్రజలు కల్లుకు క్యూ కట్టడం మనం చూడొచ్చు.ఈ సంగతులు అలా ఉంచితే.. ఇక్కడ దొరికే సీసా కల్లు ధర సాధారణ ధర కంటే ఎక్కువే. ఈ కల్లును జీలుగ కల్లు అంటారు.తెలంగాణాలోని సూర్యాపేటకు సమీపంలోని కాసరబాదలో ఈ కల్లు లభిస్తుంది. ఈ కల్లు తాగడం వలన కిడ్నీలో రాళ్లు కరిగిపోవడంతో పాటు షుగర్ కూడా తగ్గిపోతుంది.
కాసరబాద గ్రామానికి చెందిన సైదులు సుమారు 15 ఏళ్ల కిందట జీలుగ చెట్ల కల్లు గీసేందుకుగాను చత్తీస్ గఢ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో వాటి విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. అలా తన గ్రామంలో ఆ చెట్లకు మూడేళ్ల నుంచి కల్లు పారుతున్నది. దాంతో జనం ఆ కల్లు తాగేందుకు ఎగబడుతున్నారు. ఒక్క బాటిల్ ధర రూ.500. కాగా, ముందు రోజు ఆర్డర్స్ ఇస్తేనే లభిస్తుంది. లేదంటే ఈ కల్లు లభించదు. ఈ కల్లుకు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ దీంతో ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలున్నాయి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.