Costly Toddy : ఈ కల్లు బాగా కాస్ట్లీ .. ఒక్క సీసా ధర రూ.500.. ఎందుకో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Costly Toddy : ఈ కల్లు బాగా కాస్ట్లీ .. ఒక్క సీసా ధర రూ.500.. ఎందుకో తెలుసా?

 Authored By mallesh | The Telugu News | Updated on :24 January 2022,7:00 am

Costly Toddy : తెలంగాణలోని జనాలకు కల్లు తాగే సంప్రదాయం ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ కల్లుకు జనరల్‌గా అయితే వందనో లేదా రెండొందలో ఉంటుంది. అలా కల్లు తక్కువ ధరకు దొరుకుతుంటుంది. కానీ, మనం తెలుసుకోబోయే ఈ కల్లు మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడ బాటిల్ కల్లు ధర రూ.500. దానికి తోడు ఈ కల్లును ముందు రోజు బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది. ఇంతకీ ఆ కల్లు ఎక్కడుంది? దానిలో విశేషాలేంటనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కల్లు సాధారణ కల్లు కంటే కూడా కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. రెడీ మేడ్ గా దొరికే ఆల్కహాల్ కంటే ప్రకృతిలో దొరికే కల్లు తాగడం వలన చక్కటి ప్రయోజనాలుంటాయని పెద్దలు చెప్తుంటారు కూడా. దాంతో జనం కూడా తెల్లవారగానే కల్లుకు క్యూ కడుతుంటారు. అలా ప్రజలు కల్లుకు క్యూ కట్టడం మనం చూడొచ్చు.ఈ సంగతులు అలా ఉంచితే.. ఇక్కడ దొరికే సీసా కల్లు ధర సాధారణ ధర కంటే ఎక్కువే. ఈ కల్లును జీలుగ కల్లు అంటారు.తెలంగాణాలోని సూర్యాపేటకు సమీపంలోని కాసరబాదలో ఈ కల్లు లభిస్తుంది. ఈ కల్లు తాగడం వలన కిడ్నీలో రాళ్లు కరిగిపోవడంతో పాటు షుగర్ కూడా తగ్గిపోతుంది.

do you know this toddy is very costly

do you know this toddy is very costly

Costly Toddy : బుక్ చేసుకుంటేనే ఇక్కడ కల్లు దొరుకును..

కాసరబాద గ్రామానికి చెందిన సైదులు సుమారు 15 ఏళ్ల కిందట జీలుగ చెట్ల కల్లు గీసేందుకుగాను చత్తీస్ గఢ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో వాటి విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. అలా తన గ్రామంలో ఆ చెట్లకు మూడేళ్ల నుంచి కల్లు పారుతున్నది. దాంతో జనం ఆ కల్లు తాగేందుకు ఎగబడుతున్నారు. ఒక్క బాటిల్ ధర రూ.500. కాగా, ముందు రోజు ఆర్డర్స్ ఇస్తేనే లభిస్తుంది. లేదంటే ఈ కల్లు లభించదు. ఈ కల్లుకు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ దీంతో ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది