Romance : పబ్లిక్ గా ట్రైన్ లో అందరు చూస్తుండగా ముద్దుల్లో తేలిన జంట
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా ఉంటారు. అయితే ఇటీవల ఒక యువ జంట రైలులో చేసిన పనులు చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఆ జంట ఎలాంటి అదుపు లేకుండా బహిరంగంగానే రొమాన్స్‌లో మునిగిపోయింది. తమను ఎవరో వీడియో తీస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా వారు ప్రవర్తించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Couple caught kissing in public on a train while everyone is watching
యువత రానురాను మరీ బరితెగిస్తున్నారని, రీల్స్, సోషల్ మీడియా ప్రభావంతో ఏమి చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. తోటి ప్రయాణికులు తమను ఎలా చూస్తారని కూడా ఆలోచించకుండా ఆ జంట ప్రవర్తించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “రైలును ఓయో రూమ్ చేశారంటూ” మరియు “ఓయో ట్రైన్” అంటూ కామెంట్లు పెడుతూ మండిపడుతున్నారు.
ఇలాంటి ఘటనలు రైలులో ప్రయాణించే కుటుంబాలకు ఇబ్బందికరంగా మారతాయి. రైలులో బహిరంగంగా ఇలాంటి పనులకు పాల్పడిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలలో అందరూ ప్రయాణిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన గుర్తుచేస్తుంది.
OYO Train
ऐसे लोगों ने अब टट्रैन को भी oyo बना दिया 🤦♀️🤦♀️ pic.twitter.com/ZZCZ3nADdj
— दिव्या कुमारी (@divyakumaari) September 6, 2025