AP Gas Cylinders Free : ఏపీలో దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్స్.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి..!
ప్రధానాంశాలు:
AP Gas Cylinders Free : ఏపీలో దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్స్.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి..!
AP Gas Cylinders Free : టీడీపీ కూటమి అఖండ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ సిక్స్‌లు అంటూ కూటమి భారీ వరాలు కురిపించింది. ఉచిత బస్ దగ్గరి నుంచి చాలానే పథకాలు అందిస్తామని హామీ ఇచ్చింది. వీటిల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఒక భాగమనే చెప్పుకోవచ్చు. మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు త్వరలోనే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు.
AP Gas Cylinders Free ఇవి తప్పక ఉండాలి..
చంద్రబాబు నాయుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో అధికారం తెలియదు. రానున్న కాలంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రీ సిలిండర్ లభిస్తే.. చాలా మందికి ఊరట లభిస్తుంది. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు స్కీమ్‌పై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 1.3 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అందువల్ల అందరికీ స్కీమ్ వర్తిస్తుందా? లేదంటే నిబంధనలు ఏమైనా పెడతారా? అనేది చూడాలి. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఉచిత సిలిండర్ పథకం వర్తించదని నివేదికలు పేర్కొంటున్నాయి.

AP Gas Cylinders Free : ఏపీలో దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్స్.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి..!
కరెంట్ బిల్లులు, ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నెంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి స్కీమ్‌కు అర్హులను గుర్తించే అవకాశం ఉందని తెలియజేస్తున్నాయి.దారిద్ర్య రేఖకి దిగువున ఉన్నవారికి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తంది.కొన్ని అర్హతలు కూడా అడిగే అవకాశం కూడా ఉంది. లబ్ధాదారుడు ఏపీ వాసి అయి ఉండాలి. అలానే అతనికి ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండాలి. ఇక దీనికి సంబంధించిన ప్రక్రియ పోర్టల్ ప్రారంభం అయిన తర్వాత మొదలవుతుంది.