Viral Video : ఈ పిచ్ మీద క్రికెట్ ఆడితే మీరు గ్రేట్.. ఆడిన వాళ్ల పరిస్థితి ఏమైందో మీరే చూడండి..!

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 20 June 2021, 9:56 am

Viral Video : సాధారణంగా క్రికెట్ ఎక్కడ ఆడుతారు. క్రికెట్ గ్రౌండ్ లో ఆడుతారు. క్రికెట్ అంటే మన యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో క్రికెట్ ఆటకు ఉన్న ఫాలోయింగ్.. మరే ఆటకు లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. కాసింత సమయం దొరికితే చాలు.. బ్యాట్, బాల్ పట్టుకొని గల్లీలో లేక గ్రౌండ్ లో ఎక్కడైనా క్రికెట్ ఆడాల్సిందే. క్రికెట్ ఉన్న పాపులారిటీ అటువంటిది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. చాలామంది టైమ్ పాస్ కోసమో లేక బెట్టింగ్ లు కట్టో.. క్రికెట్ ఆడుతుంటారు. అయితే.. క్రికెట్ ఆడాలంటే కావాల్సింది మంచి గ్రౌండ్. తర్వాత మంచి పిచ్. పిచ్ సరిగ్గా లేకపోతే క్రికెట్ ఆడటం చాలా కష్టం.

dangerous cricket pitch viral video

dangerous cricket pitch viral video

అయితే.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చాలా విచిత్రమైనది. వీళ్లు క్రికెట్ ఏ పిచ్ మీద ఆడుతున్నారో చూస్తే నోరెళ్లబెడతారు. ఎందుకంటే.. ఇలా క్రికెట్ ఆడటం ఎప్పుడూ చూసి ఉండరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పిచ్ మీద మీరు క్రికెట్ ఆడితే మీరు గ్రేటే.

Viral Video : అది మామూలు పిచ్ కాదు.. జారుడు పిచ్

సాధారణంగా పిచ్ గట్టిగా ఉంటుంది. ఎందుకంటే.. పిచ్ లోనే బంతిని కొట్టాక బ్యాట్స్ మెన్ పరిగెత్తాల్సి ఉంటుంది. కాబట్టి.. పిచ్ ను గట్టిగా తయారు చేస్తారు. కానీ.. ఈ వీడియోలో చూడండి.. పిచ్ ఎంత బురదగా ఉందో. కాస్త అటూ ఇటూ కాలు జరిపినా చాలు.. జారిపడటం ఖాయం. అటువంటి ప్రాంతంలో వీళ్లు క్రికెట్ ఆడుతున్నారు. ఇక.. వీళ్ల క్రికెట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పిచ్ మీద ఆడాలంటే.. క్రికెట్ ఆడటం తెలిస్తే కాదు.. జారి పడకుండా ఉండటం నేర్చుకోవాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసుకోండి.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి