ఆ వారాల్లో అమ్మాయి అత్తారింటికి అస్సలే వెళ్లకూడదట!
పెళ్లై అత్తారింటికి వెళ్లిన అమ్మాయి.. తల్లిగారింటికి వచ్చి మళ్లీ అత్తారింటికి వెళ్లేటప్పుడు కొన్ని వారాల్లో వెళ్లొద్దని చెప్తారు. అంతే కాకుండా తొమ్మిది రోజులు అవుతున్నా అలా వెళ్తే… అపశఖునం అని చెప్తుంటారు. ముఖ్యంగా మంగళ, శుక్ర వారాల్లో అమ్మాయి అత్తారింటికి తిరుగు ప్రయాణం చేయకూడదని చెబుతుంటారు. అసలు మంగళ, శుక్ర వారాల్లో అమ్మాయి అత్తారింటికి వెళ్తే… తొమ్మిదో రోజుల్లో వెళ్తే ఏం అవుతుంది.. అలా ఎందుకు వెళ్లకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే మంగళ వారం, శుక్రవారం లక్ష్మీదేవి స్థానాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే పుట్టినింట్లో ఆడ పిల్లది కూడా లక్ష్మీదేవి స్థానమని చెబుతారు.
అందుకే అమ్మాయి మంగళ, శుక్ర వారాల్లో బయటకు వెళ్లకూడదని అంటుంటారు. ముఖ్యంగా పెళ్లై అత్తారింటికి వెళ్లే అమ్మాయిని మాత్రం అస్సలు మంగళ, శుక్ర వారాల్లో పంపించరు. ఒక వేళ అలా వెళ్తే… తమ ఇంట్లో ఉన్న లక్ష్మీ దేవియే వేరే వాళ్ల ఇంటికి వెళ్తున్నట్లుగా భావిస్తారు. అందుకే అస్సలు తమ కూతురును అత్తారింటికి మంగళ, శుక్ర వారాల్లో వెళ్లనివ్వరు. ఖచ్చితంగా మంగళ, శుక్ర వారాల్లో వెళ్లాల్సి వస్తే… కొన్ని పద్ధతులు పాటిస్తారు. అలా చేస్తే… తన ఇంటి మహా లక్ష్మీ అమ్మాయితో పాటు అత్తింటికి వెళ్లిపోదని అనుకుంటుంటారు.అయితే అమ్మాయి పుట్టింటికి వచ్చి… అత్తారింట్లో ఏదో సమస్య వచ్చో లేదా ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే మాత్రం…
ముందు రోజు గడప బయట ఒక సంచిని పెడుతుంటారు. ఆ తర్వాతి ఆమె వెళ్లేటప్పుడు ఆ సంచిని తీసుకెళ్లమని చెబుతుంటారు. అలా సంచి తీసుకెళ్లడం వల్ల తమ ఇంటి మహా లక్ష్మీ ఆమెతో వెళ్లజని పెద్దల నమ్మకం. అలాగే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అదృష్టం కలిసి వస్తే.. పెళ్లై ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్లేటప్పుడు పుట్టినింటి గడపపై బంగారు తీగను కొట్టిస్తారు. అలా చేయడం వల్ల ఆ అమ్మాయితో వచ్చిన అదృష్ట లక్ష్మి తమ ఇంట్లోనే ఉంటుందని పెద్దల నమ్మకం.