Deposit : 2 రూపాయల డిపాజిట్ తో.. 36 వేలు పొందే సువర్ణవకాశం.. త్వరపడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deposit : 2 రూపాయల డిపాజిట్ తో.. 36 వేలు పొందే సువర్ణవకాశం.. త్వరపడండి..!

 Authored By kranthi | The Telugu News | Updated on :27 December 2021,11:00 am

Deposit : ఇకపై రోజు వారీ కూలీలు కూడా ఉద్యోగులు మాదిరిగానే వయసు పై బడిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందే అవకాశం లభించింది. అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం దృష్ట్యా కేంద్రం ప్రభుత్వం వారికొక అద్భుతమైన పథకం తీసుకు వచ్చింది. ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మంధన్ యోజన పథకం ద్వారా… అసంఘటిత రంగంలో పనిచేసే వీధి వర్తకులు, రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కూలీలు, ఇతరులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రూ.2 తో ఏడాదికి రూ.36 వేల పెన్షన్‌…!అసంఘటిత రంగంలోని కార్మికులు పదవీ విరమణ పొందిన తర్వాత ఈ పథకం వారికి సాయం పడనుందని కేంద్రం తెలిపింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కార్మికులకు పెన్షన్ చెల్లింపు భరోసాగా నిలవనున్నట్లు పేర్కొంది. కేవలం రోజుకు రూ.2 చెల్లించడం ద్వారా ఏడాదికి రూ.36 వేల పెన్షన్‌ను కార్మికులు పొందేందుకు వీలు అవుతుందని వివరించింది.పథకాన్ని ప్రారంభించాలంటే, ముందుగా మనం నెలకు రూ. 55ను డిపాజిట్ గా జమ చేయాలి. ఉదాహరణకు, మీకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి

deposit of 2 rupees get 36 thousand rupees with prime minister shram yogi mandhan yojana

deposit of 2 rupees get 36 thousand rupees with prime minister shram yogi mandhan yojana

Deposit : ముందుగా నెలకు రూ.55 డిపాజిట్ చేయాలి..¡

రోజుకు రూ.2 ఈ పథకంలో జమ చేయడం ద్వారా, వృద్దాప్యంలో నెలకు రూ. 36 వేల పెన్షన్‌ను పొందే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు, 60 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఈ పెన్షన్‌కు అర్హులవుతారని తెలిపింది. ఈ పథకం కోసం ఓ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఉండాలని తెలిపింది. ముఖ్యంగా ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నెలవారీ వేతనం రూ.10 వేల కంటే తక్కువగా ఉండాలని స్పష్టం చేసింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచిన వెబ్ పోర్టల్‌ను ఉపయోగించుకోవాలని తెలిపింది. పథకం గురించి మరిన్ని వివరాల కోసం 18002676888 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చని సూచించింది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది