Ys Jagan : పాలనా వికేంద్రీకరణతోనే డెవలప్మెంట్ వైఎస్ జగన్
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఆవిష్కరణ జరిగింది. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ 26 జిల్లాల రాష్ట్రంగా అవతరించింది. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. ఆ తర్వాత వరుసగా అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీసత్యసాయి జిల్లాలను వరుసగా ప్రారంభించారు. అనంతరం మొత్తం 26 జిల్లాలతో కూడిన ఏపీ మ్యాప్ ను సీఎం ఆవిష్కరించారు.
ఈ రోజు నుంచి ఏపీలో కొత్త శకం ప్రారంభం కాబోతోందని సీఎం జగన్ అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో తొలి అడుగు ముందుకేశామని అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాలల కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులకు బాధ్యతలు స్వీకరించారు. పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో కొన్నింటిని మార్పులు చేశామని, ప్రజల విన్నపాల మేరకు ఈ మార్పులు చేసినట్లు వివరించారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో కొత్త కార్యాలయాల ద్వారానే సేవలు కొనసాగుతాయని, ఉద్యోగులు కొత్త కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తారని సీఎం చెప్పారు.
Ys Jagan : ఈ రోజు నుంచే కొత్త శకం..
కాగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కూడా చర్చకు రాగా కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ప్రస్తావించిన జగన్ తనదైన శైలిలో చెప్పారు. కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు.. 14 ఏళ్లు ఆయన సీఎంగా ఉన్నా.. రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసులేక ప్రభుత్వానికి లేఖ రాశారని, స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. చంద్రబాబు చేయలేని పనిని తాము చేశామని జగన్ చెప్పకనే చెప్పారు. చంద్రబాబు చేయలేని పనిని తాము చేసి చూపించామన్నారు.