Dhanteras 2025 | ధన్‌తేరాస్ 2025: బంగారం, వెండితో పాటు ఇవి కొనడం కూడా శుభప్రదమే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dhanteras 2025 | ధన్‌తేరాస్ 2025: బంగారం, వెండితో పాటు ఇవి కొనడం కూడా శుభప్రదమే!

 Authored By sandeep | The Telugu News | Updated on :4 October 2025,6:00 am

Dhanteras 2025 | దీపావళి పండుగకు శుభారంభం ధన్‌తేరాస్‌తో మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథిన జరుపుకునే ఈ పర్వదినం సంపద, శ్రేయస్సుకు సంకేతంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ రోజున సముద్ర మథనంలో ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యారని నమ్మకం ఉంది. అందుకే ఈ రోజున బంగారం, వెండి, లోహ పాత్రలు కొనడం పవిత్రంగా భావిస్తారు.

దృక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ధన్ త్రయోదశి అక్టోబర్ 18, శనివారం జరుపుకుంటారు. తిథి మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 19 మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. బంగారం, వెండిని కొనలేకపోయినా, జ్యోతిష్యం ప్రకారం కొన్ని వస్తువులను ధన్‌తేరాస్ రోజున కొనడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.

#image_title

* పాత్రలు: కొత్త పాత్రలు కొనడం ధన్వంతరి కృపకు సూచిక.
* ఇత్తడి : ఆరోగ్యం, అదృష్టం, 13 రెట్లు సంపదను తెస్తుందని నమ్మకం.
* రాగి, కాంస్య : ఈ లోహ పాత్రలు కూడా శుభప్రదం.
* చీపురు : పేదరికాన్ని తొలగించి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విశ్వాసం.
* ధనియాలు : పూజ అనంతరం వాటిని సేఫ్‌లో ఉంచితే సంపద పెరుగుతుందని చెబుతారు.
* లక్ష్మీ-గణేష్ విగ్రహాలు : దీపావళి పూజ కోసం ధన్‌తేరాస్ రోజున కొనడం పవిత్రం.
* శ్రీయంత్రం, కుబేర యంత్రం : సంపద, శ్రేయస్సు కోసం ఉపయోగకరం.
* గోమతి చక్రం : ఆర్థిక సమస్యలను తొలగించి స్థిరత్వం కలిగిస్తుందని నమ్మకం.
* పసుపు గవ్వలు : లక్ష్మీ కటాక్షానికి ప్రతీకగా వీటిని సేఫ్‌లో ఉంచుతారు.

జాగ్రత్తలు
ఈ రోజున నల్లటి వస్తువులు, ఇనుముతో చేసిన పదునైన వస్తువులు (కత్తి, కత్తెర) కొనరాదు. ఇవి అశుభంగా పరిగణించబడతాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది