
Dharmavaram MLA Kethireddy Fire On Jio Tower Manager
MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎమ్మెల్యే అనే పదవికి పూర్తిగా న్యాయం చేస్తున్న నాయకుడు. పార్టీలకు.. అతీతంగా ప్రజా సమస్యల విషయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఆయన నిర్వహించిన “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ క్రియేట్ చేసింది.
Dharmavaram MLA Kethireddy Fire On Jio Tower Manager
ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉదయాన్నే లెగిసి తనని గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై పరిష్కారాలు చూపిస్తారు. పెన్షన్స్, రోడ్ల సమస్యలు ఇంకా ప్రభుత్వం నుండి ప్రజలకు రావలసిన రకరకాల కార్యక్రమాల విషయంలో సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతాయి. ఈ రీతిగానే ఒక ఇంటి వద్ద జియో టవర్ మేనేజర్… టవర్స్ వేయడానికి పెద్ద గోయి తవ్వడం జరిగింది.
దీంతో గొయ్యి రోడ్డు పక్కన చాలా లోతుగా తొవ్వడంతో… మరో పక్క ఇల్లు ఉండటంతో సంబంధిత ఇంటి ఓనర్ గొయ్యి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో వెంటనే ఎమ్మెల్యే కేతిరెడ్డి జియో టవర్ మేనేజర్ పై మండిపడి ఫోన్ చేయాలని పక్కనున్న సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఫోన్ ఎత్తకపోవడంతో వెంటనే రోడ్డు ఏమైనా వాడి అబ్బ జాగీరా అంటూ కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో కచ్చితంగా ఈ సమస్య తన పరిష్కరిస్తానని అక్కడ ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.