Disney plus hotstar : ప్రముఖ ఓటీటీ సంస్థలు తమ యూజర్లను పెంచుకునేందుకుగాను విభినమైన ప్లాన్స్‌తో ముందుకొస్తున్నాయి. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా తాజాగా మరో ఓటీటీ కూడా అందుకు ముందుకొచ్చింది. డిస్నీ+హాట్‌స్టార్ కేవలం రూ. 49 చెల్లిస్తే నెల రోజులపాటు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ప్రత్యేకమైన మెంబర్‌షిప్ ప్లాన్ కేవలం తాము ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.డిస్నీ+హాట్‌స్టార్ ఈ ప్లాన్ ను… 720పీ హెచ్‌డీ వీడియో రెజల్యూషన్ తో, స్టీరియో ఆడియో క్వాలిటీ వరకు అవకాశాన్ని కల్పిస్తూ… స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ లలో ఏదో ఒక డివైజ్‌కి మాత్రమే సపోర్టు ఇచ్చేలా రూపొందించింది.
ప్రస్తుతం కస్టమర్లకు రూ.299 తో నెలవారీ మొబైల్ ప్లాన్ అందుబాటులో ఉండగా.. ఈ ప్లాన్‌లో డాల్బి 5.1 ఆడియో సపోర్టుతో 4కే రెజల్యూషన్ స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో ఒకేసారి నాలుగు డివైజ్‌లలో ప్లే అవుతుందని తెలుపుతూ.. ఈ ప్లాన్ ఏడాది మొత్తానికి అయితే ధర రూ.1,499గా చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది.ఇదిలా ఉండగా 2 డివైజ్‌ల సపోర్టుతో, 1080పీ ఫుల్ హెచ్‌డీ స్ట్రీమింగ్‌ను రూ.899 ప్లాన్‌పై అందించనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. అలాగే ఆరు నెలల పాటు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే దానిపై రూ.100 డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నెలకు రూ.299గా ఉన్న ఈ ప్లాన్.. అదే 6 నెలల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకుంటే ఒక్కో నెలకు రూ.199 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
వీటితో పాటు ప్రస్తుతం మూడు కొత్త ప్లాన్లను ఆఫర్ చేస్తుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. వాటిలో ఏడాదికి రూ.499 మొబైల్ ప్లాన్, ఏడాది రూ.899 సూపర్ ప్లాన్, ఏడాదికి రూ.1499 ప్రీమియం ప్లాన్‌లు ఉన్నాయి. అయితే రూ.499 బేసిక్ ప్లాన్ మాత్రం ఒక్క మొబైల్ డివైజ్‌కి మాత్రమే వస్తుంది. వరుస పండుగలు, సెలవుల నేపథ్యంలో.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సెలవుల్లో మరింత మంది యూజర్లను చేరుకోవాలనే ప్రయత్నంలోనే తాజా ఆఫర్లను ప్రకటించినట్లు సమాచారం. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్… ఇతర ప్రముఖ ఓటీటీలకు దీటుగా సరికొత్త షోలను, మూవీలను కూడా తన ప్లాట్ ఫామ్‌పై విడుదల చేస్తోంది.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.