Divorce | చైతూ- సామ్ బాట‌లో మ‌రో జంట‌.. అధికారికంగా జీవీ ప్రకాష్ – సైంధవి విడాకులు

Authored By Sam C | The Telugu News | Published on: October 1, 2025, 1:00 pm

Divorce | ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, గాయని సైంధవి తమ 12 ఏళ్ల వైవాహిక జీవితం ముగిసింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. గతేడాది వీరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్న అనంతరం, ఈ ఏడాది మేలో పరస్పర అంగీకారంతో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.

#image_title

లవ్ మ్యారేజ్‌ నుంచి విడాకుల వరకు…

విడాకుల పిటిషన్ దాఖలైన తర్వాత, న్యాయమూర్తి వారికి చట్టం ప్రకారం ఆరు నెలల గడువు ఇచ్చారు. ఈ గడువు ముగిసిన అనంతరం, జీవీ ప్రకాష్, సైంధవి సెప్టెంబర్ 25న కోర్టుకు స్వయంగా హాజరై తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. కోర్టు విచారణ సమయంలో కుమార్తె ఎవరి సంరక్షణలో ఉంటుందనే ప్రశ్నకు, ఆమె తల్లి సైంధవి వద్దే ఉండాలని జీవీ ప్రకాష్ స్పష్టం చేశారు. ఆయనకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

చెన్నై ఫ్యామిలీ కోర్టు ఇరువురి అంగీకారాన్ని పరిగణనలోకి తీసుకుని విడాకులు మంజూరు చేసింది. దీంతో 12 ఏళ్ల వివాహ బంధానికి అధికారికంగా ముగింపు పలికింది. ఈ జంట విడిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేయగా, వారి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పలువురు పేర్కొన్నారు.ఇటీవల జీవీ ప్రకాష్ తన సంగీత విభాగంలో ప్రతిభ కనబర్చుతూ నేషనల్ అవార్డు అందుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఓ అధ్యాయానికి ముగింపు పలికిన ఆయన, ఇప్పుడు తన కెరీర్‌పై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. జీవీ ప్రకాష్ – సైంధవి లవ్ మ్యారేజ్ 2013లో జరిగింది. 2020లో ఓ పాపకు జన్మనిచ్చారు.

Also read

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp