Diwali | లక్ష్మీ పూజతో పాటు తులసి పూజకు ప్రాధాన్యం .. శుభ ఫలితాల కోసం పాటించాల్సిన ప్రత్యేక ఆచారాలు
Diwali | హిందువుల పర్వదినాలలో దీపావళికు విశేషమైన స్థానం ఉంది. చీకట్లను దీపాల వెలుగుతో తొలగించే ఈ పండుగను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య రోజున జరిగే ఈ పండుగను సిరిసంపదలు, శాంతి, అదృష్టానికి ప్రతీకగా పరిగణిస్తారు.
#image_title
దీపావళి 2025 తేదీ ఎప్పుడంటే?
వేద క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది ఆశ్వయుజ అమావాస్య అక్టోబర్ 20న తెల్లవారుజామున 03:44 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 21 ఉదయం 05:54 గంటలకు ముగుస్తుంది. దీంతో దీపావళి 2025 పండుగ అక్టోబర్ 20న జరుపుకోవాలి
లక్ష్మీ పూజతో పాటు తులసికి ప్రత్యేక స్థానం
దీపావళి రోజున లక్ష్మీ దేవి, గణేశుడి పూజ ప్రధానంగా జరిపినా, తులసి మొక్కకు పూజ చేయడం అత్యంత శుభంగా భావించబడుతుంది. ఇది ఆర్థిక స్థిరత్వం, సుఖసంతోషాలకు దోహదపడుతుందన్న నమ్మకం ఉంది.
తులసి పూజ ఎలా చేయాలి?
తులసి వద్ద దేశీ ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి
తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి
పసుపు, కుంకుమ, గాజులు, రవిక వంటి వస్తువులతో తులసిని అలంకరించాలి
ఆవు పాలతో చేసిన నైవేద్యం సమర్పించి, వివాహిత స్త్రీకి వాయినంగా ఇవ్వాలి
కొద్దిగా గంగాజలం కలిపిన నీటిని తులసికి సమర్పించి, తులసి మంత్రాలు జపించాలి