Diwali | దీపావళి పండుగలో పాత ప్రమిదలను ఉపయోగించవచ్చా.. తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
Diwali | దీపాల పండుగగా ప్రసిద్ధి చెందిన దీపావళి, చీకటిపై కాంతి విజయాన్ని, ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును తీసుకువచ్చే పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజించి, ఇంటంతా దీపాలతో ప్రకాశింపజేస్తారు. అయితే చాలామందికి ఒక సందేహం గతంలో ఉపయోగించిన పాత మట్టి ప్రమిదలను (దీపాలను) ఈ రోజు మళ్లీ వెలిగించడం శుభమా, అశుభమా?
#image_title
పాత మట్టి ప్రమిదలు ఉపయోగించడం శుభమా?
పండితుల ప్రకారం, పూజలో ఉపయోగించిన మట్టి ప్రమిదలను మళ్లీ ఉపయోగించడం శుభప్రదం కాదని చెబుతున్నారు. పూజ సమయంలో దీపాలు దైవారాధనలో భాగంగా ప్రతికూల శక్తిని గ్రహిస్తాయని నమ్మకం ఉంది. అందువల్ల ప్రధాన దీపావళి పూజలో పాత ప్రమిదలను ఉపయోగించరాదు.
యమ దీపం మాత్రం మినహాయింపు
ధన త్రయోదశి లేదా నరక చతుర్దశి (ఛోటి దీపావళి) సందర్భంగా వెలిగించే యమ దీపం మాత్రం పాత ప్రమిదలో వెలిగించవచ్చు. ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి, యముడికి అంకితం చేస్తారు. కుటుంబం అకాల మరణం నుంచి రక్షించమని ప్రార్థనతో దీన్ని వెలిగిస్తారు.
లోహ ప్రమిదల నియమాలు
ఇత్తడి, వెండి లేదా రాగి వంటి లోహాలతో తయారు చేసిన దీపాలను దీపావళి రోజున ఉపయోగించాలనుకుంటే — ముందుగా వాటిని శుభ్రం చేసి, అగ్నితో శుద్ధి చేసిన తర్వాత ఉపయోగించాలి. అలా చేయడం వలన అది మళ్లీ పూజార్హంగా మారుతుంది.