Diwali | దీపావళి రోజున దీపాల ప్రకాశం వెనుక ఉన్న ప్రత్యేక విశేషాలు.. నిపుణుల సూచనలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diwali | దీపావళి రోజున దీపాల ప్రకాశం వెనుక ఉన్న ప్రత్యేక విశేషాలు.. నిపుణుల సూచనలు

 Authored By sandeep | The Telugu News | Updated on :13 October 2025,6:00 am

Diwali | శుభమైన దీపావళి పండుగ రానుంచి ప్రతి ఇంటిలో దీపాల వెలుగు వెలిసే సమయం ఇది. ఆనందానికి, విజయానికి, వెలుగుకు ప్రతీకగా భావించే దీపాలు దైవానికి అర్పణగా వెలిగించటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే, దీపావళి రోజున దీపాలను ఎలా వెలిగించాలో తెలియని వారు చాలామందే ఉన్నారు. దీపాలను పూజా విధిగా వెలిగించాలంటే కొన్ని నియమాలను పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు.

#image_title

దీపావళి దీపాల వెలిగింపు పద్ధతి ఇదే!

దీపావళి రోజు లక్ష్మీ గణేశుల పూజలో దీపాలను నేరుగా నేలపై ఉంచరాదు. దీపాన్ని ఉంచే ముందు ఆసనం, ఆకు లేదా అక్షతలు ఉంచి దాని మీద దీపం పెట్టి వెలిగించాలి. దీపం ఒక పవిత్ర రూపంగా భావించబడుతుంది కాబట్టి, పూజలో దీనికి ప్రత్యేక స్థానం ఇవ్వాలి.

దీపాల్లో నూనె పూర్తిగా పోయరాదు

నిపుణుల మాటల ప్రకారం, దీపంలో నూనెను నిండుగా పోయడం తప్పు. ఇలా చేయడం వల్ల నూనె పొంగి బయటకి వస్తే, దైవానికి అవమానంగా పరిగణిస్తారు. అంతేకాదు, దీపాల నుండి నూనె వృథాగా కిందపడిపోవడం అంటే ధనం వృథా కావడం అనే అర్థం వస్తుంది. ఇది లక్ష్మీదేవికి అప్రీతికి సంకేతంగా భావించబడుతుంది. దీని వల్ల ఆర్థిక సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది