Paytm loan : గుడ్ న్యూస్.. పేటీఎం ఆఫర్.. షూరిటీ లేకుండానే రూ. 5లక్షల లోన్.. ఎలా అప్లయ్ చేయాలంటే..?
Paytm loan : మీరు చేయాలనుకుంటున్న వ్యాపారాన్ని డబ్బు కొరతతో నిలిపివేశారా..? ఇప్పటికిప్పుడు అప్పు కావాలా? ఇక నుంచి అప్పు కోసం అక్కడా, ఇక్కడా తిరగాల్సిన అవసరం లేదు. అవునండీ. మీరు పేటీఎం యాప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఈ పని సులభం అయినట్లే. వెంటనే మీరు మీ పేటీఎం యాప్ ఓపెన్ చేసి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఈ ప్రముఖ డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం.. తమ వినియోగ దారుల కొరకు బంపరాఫర్ ప్రకటించింది. చిరు వ్యాపారులకు ఎలాంటి రుసుము లేకుండా రూ.5 లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నట్లు ఈ మేరకు ప్రకటించింది. వ్యాపారులు పేటీఎం ఫర్ బిజినెస యాప్‌లో మర్చెంట్ లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా రుణాలు తీసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం డిజిటల్ పద్ధతిలో పూర్తవుతుంది. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. వ్యాపారుల క్రెడిట్ హిస్టరీ, రోజువారీ లావాదేవీలను బట్టి వారికి యాప్‌లోనే రుణాలు మంజూరవుతాయి. అయితే ఈ లోన్ ను పొందడానికి వ్యాపారులు తమ పేటీఎం యాప్ లో ఈ 5 స్టెప్స్ ను అనుసరిస్తూ లోన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
1. ముందుగా పేటీఎం యాప్‌ని తెరిచి, ‘Business Loan’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
2. అనంతరం మీకు లోన్ ఎంత కావాలో నిర్ణయించుకుని ఆ అమౌంట్ ను అక్కడ ఎంటర్ చేయాలి. అందులోనే టెన్యూర్, డైలీ ఇన్‌స్టాల్‌మెంట్ వంటి ఇతర వివరాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి, వ్యాపారి రుణ మొత్తాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు
3. అనంతరం మీరు ఎంటర్ చేసిన ఆ వివరాలన్నీ సరిచూసుకొని వాటిని నిర్ధారిస్తూ కన్ఫామ్ చేయాలి. ఆ తర్వాత సీకేవైసీ నుంచి మీ కేవైసీ వివరాలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలి.
4. అనంతరం మీ పాన్ కార్డ్ వివరాలు, పుట్టిన తేదీ, ఇమెయిల్ వంటి ఇతర వివరాలను ఎంటర్ చేసి నిర్ధారించాలి చేయాలి.
5. ఇదంతా పూర్తయిన తర్వాత మీరు ఎంటర్ చేసిన వివరాల మేరకు మీ అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. ఈ రుణాల సగటు రూ.1,20,222 నుంచి రూ.1,40,000 మధ్య ఉందని, యావరేజ్ టెన్యూర్ 12 నెలల నుంచి 14 నెలలు ఉంటుందట. ఇప్పటికే అనేక మంది ఈ లోన్లు తీసుకుంటున్నారని పేటీఎం సంస్థ వివరించింది.