Malla Reddy : మల్లా రెడ్డి ఆస్తి మొత్తం ఎంత.. రోజుకి ఎన్ని కోట్లు సంపాదిస్తాడు.. ఫుల్ డీటైల్స్..!
Malla Reddy : ప్రస్తుతం తెలంగాణలో వినిపిస్తున్న ఒకే ఒక పేరు మల్లా రెడ్డి. అవును… ఆయన మీద గత కొన్ని రోజుల నుంచి ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి దగ్గర భారీగా ఆస్తులు ఉన్నాయని.. వాటికి సరైన ఇన్ కమ్ టాక్స్ కడుతున్నారో లేదో అని చెక్ చేసేందుకు ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. అయితే.. నేను చాలా పనులు చేసి డబ్బులు సంపాదించానని.. బర్లు కొన్నాను.. పాలు అమ్మాను.. పూలు అమ్మాను.. బోర్లు వేశాను…
చిట్ ఫండ్ లు కూడా నడిపాను అని మంత్రి మల్లారెడ్డి మీడియాతో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే.. అసలు మంత్రి మల్లారెడ్డి రోజుకు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు. ఆయనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. మంత్రి మల్లారెడ్డిది పెద్ద విద్యా సామ్రాజ్యం. ఆయనకు చాలా కాలేజీలు ఉన్నాయి. భూములు కూడా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టపక్కన వందల ఎకరాల భూములు ఉన్నాయి. తనకు ఉన్న కాలేజీల్లో సిబ్బందికే కోట్ల రూపాయల జీతాలు ఇస్తుంటారు మల్లారెడ్డి.
Malla Reddy : నేను కష్టపడి పైకి వచ్చా అని చెప్పుకొచ్చిన మల్లారెడ్డి
అయితే.. మల్లారెడ్డికి ఉన్న కాలేజీలు ఎన్ని. అవి ఎవరి పేరు మీద ఉన్నాయి అనే దానిపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. మల్లారెడ్డి అల్లుడు, తమ్ముడు పేరుతో చాలా కాలేజీలు ఉన్నాయి. మల్లారెడ్డికి ఎక్కువగా ఉన్నది విద్య సంస్థలే. వాటి ద్వారానే ఆయన ఎక్కువ ఆదాయం ఆర్జిస్తుంటారు. విద్యాసంస్థల తర్వాత భూములు ఎక్కువగా ఆయన కొనుగోలు చేశారు. తన దగ్గర ఉన్న కాలేజీలు అన్నీ కలిపితే బహిరంగ మార్కెట్ లో కొన్ని వందల కోట్లు ఉంటాయట. అప్పట్లో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగానే సంపాదించారు.